Chandrababu : ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీ ఓడిపోయి డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. అన్నాడీఎంకే పార్టీ సీఎం పళ్లనిస్వామిని తమిళనాడు ప్రజలు తిరష్కరించారు. అయినా కూడా తమిళనాట అన్నాడీఎంకే పార్టీ 65 స్థానాలు దక్కించుకున్నాడు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ ఖచ్చితంగా మళ్లీ కోలుకోవడం కష్టం అనుకున్నారు. కనీసం పది సీట్లు వచ్చినా చాలా గొప్ప విషయం అన్నారు. కాని అనూహ్యంగా 65 సీట్లను అన్నాడీఎంకే దక్కించుకోవడం హాట్ టాపిక్ గా ఉంది. రాజకీయ అనుభవం అంటూ మాట్లాడే చంద్రబాబు నాయుడు Chandrababu గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యిన విషయం తెల్సిందే.
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో మాత్రం కనీసం 30 సీట్లను కూడా గెలుచుకోలేక ఢీలా పడిపోయాడు. అద్బుతమైన విజయాన్ని జగన్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన మళ్లీ మళ్లీ సీఎంగా అవ్వడం ఖాయం అంటున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగు దేశం మళ్లీ అధికారంలోకి వచ్చేది అనుమానమే అంటున్నారు. అంత తక్కువ సీట్లు వచ్చిన ఏ పార్టీ అయినా కూడా మళ్లీ అధికారంలోకి వెంటనే రావడం అనేది చాలా అరుదుగా సాగుతుంది. కనుక చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తాడా లేదా అనేది అనుమానంగానే ఉంది.
తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవం గురించి చెప్పుకుంటూ ఉంటాడు. కాని పక్క రాష్ట్రం తమిళనాడులో రాజకీయ అనుభవం లేని పళ్లని స్వామి ఓడిపోయినా కూడా 65 సీట్లను గెలుచుకున్నాడు. అది ఆయన గొప్పతనంగా వారు చెబుతున్నారు. అభివృద్ది చేసిన సీఎం కనుక పళ్లని స్వామికి అక్కడ జనాలు 65 సీట్లు ఇచ్చారు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం సత్తా చాటలేక పోయాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు గెలవలేదు కదా కనీసం పోటీ ఇవ్వలేదు అంటూ జగన్ ఫ్యాన్స్ ఎద్దేవ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.