జగనన్న చాలా మంచి పని చేశావ్ కానీ.. రెండు వారాలు ఆలస్యం..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నేపథ్యంలో స్పందిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు అవుతూ ఉండగా మరి కొన్ని చోట్ల మాత్రం రాత్రి సమయంలో కర్ఫ్యూను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు రాత్రి సమయంలో కర్ఫ్యూ ను అమలు చేశారు. కాని నేటి నుండి ఏపీలో డే టైమ్ కర్ఫ్యూ ను కూడా అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. 12 గంటల నుండి కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. తద్వార రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు.
కర్ఫ్యూ నిర్ణయం మంచిదే..
ఏపీలో మద్యాహ్నం నుండి కర్ఫ్యూ నిర్ణయంను పలువురు అభినందిస్తున్నారు. మార్నింగ్ సమయంలో జనాలకు సాదారణ కార్యకళాపాలకు ఓకే చెప్పి మద్యాహ్నం తర్వాత కర్ఫ్యూను అమలు చేయడం మంచి నిర్ణయంగా చెబుతున్నారు. జనాలు బయటకు వెళ్లక పోవడం వల్ల ఖచ్చితంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయి. మొదట రెండు వారాల పాటు కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కర్ప్యూను మరో రెండు లేదా మూడు వారాల పాటు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
రెండు వారాలు ఆలస్యం…
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. అయితే రెండు వారాల ముందు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు వారాలుగా భారీగా నమోదు అవుతున్నాయి. ఏపీలో కూడా రెండు వారాలుగా కేసుల సంఖ్య అమితంగా ఉంది. కనుక రెండు వారాల క్రితమే ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికి అయినా మంచి ఫలితాన్ని ఇస్తుందని, పక్క రాష్ట్రాల్లో జరిగే నష్టం ఏపీలో ఉండదని వారు అంటున్నారు.