బాబు ఇప్పటికైనా అచ్చెన్నపై చర్యలు తీసుకుంటాడా…?
తెలుగు దేశం పార్టీ అధినేత Chandrababu Naidu పార్టీ ముఖ్య నాయకుల విషయంలో చూపిస్తున్న వివక్ష మరియు ఆయన అనుసరిస్తున్న విధానాలు సొంత పార్టీలో విమర్శలకు తావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నను తొలగించాలనే డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అచ్చెం నాయుడు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆయన తెలుగు దేశం పార్టీ పనైపోయింది అన్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంను రేపాయి. ఆ సమయలో తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కనుక పార్టీ ముఖ్య నాయకులు ఎవరు ఆ విషయమై స్పందించలేదు.
అచ్చెన్న పై చర్యలు ఏవి..?
పార్టీపై అంతగా విమర్శలు చేసిన అచ్చెంనాయుడుపై చర్యలు తీసుకోకుంటే పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీ నడిపే విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు అంటూ ఆరోపనలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అచ్చెం నాయుడుపై చర్యలు తీసుకోకుంటే మాత్రం మరింతగా విమర్శల పాలవ్వాల్సి వస్తుందని ఈ సందర్బంగా తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.
Chandrababu నిర్ణయం ఏంటీ..
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెం నాయుడు పార్టీకి వ్యతిరేకంగా మరియు లోకేష్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా క్లీయర్ గా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయినా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బీసీ నాయకుడిపై చర్యలు తీసుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు చర్యలకు భయపడుతున్నాడా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పందించకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ విషయంలో ముందు ముందు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.