ChandraBabu : కృష్ణ, గుంటూరు మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబుకు ఘోర అవమానం
ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు కాళ్ల కు చక్రాలు కట్టుకున్నట్లుగా రాష్ట్రం లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వయసు మీద పడ్డా కూడా తనయుడు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఎక్కడ చేయి జారి పోతుందో అనే భయంతో చంద్రబాబు నాయుడు ఇంకా కూడా తెలుగు దేశం పార్టీ ని తన నెత్తిన పెట్టుకుని నడి సంద్రం ఈదుతున్నట్లుగా మీటింగ్ లు.. పార్టీ నాయకుల కార్యక్రమాలకు హాజరు అవుతున్నాడు. అయితే ఈమద్య కాలంలో ఈయన కార్యక్రమాలకు జనాలు కరువు అవుతున్నారు.
కొన్ని చోట్ల కాస్త ఎక్కువగా వచ్చినా కూడా ఎక్కువ శాతం జనాలు చంద్రబాబు నాయుడు మీటింగ్ కు వెళ్లేందుకు ఆసక్తిగా లేరట. ఈ విషయాన్ని స్వయంగా తెలుగు తమ్ముళ్లు చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనగా తెలుగు తమ్ముళ్లకు భారీ ఎత్తున జనాలను సమీకరించాలంటూ అధినాయకత్వం నుండి సమాచారం అందిందట. కాని జనాల సమీకరణ అనేది తెలుగు దేశం పార్టీ నాయకులకు చాలా పెద్ద ఇష్యూగా మారింది.ఈమద్య కాలంలో తెలుగు దేశం పార్టీ మీటింగ్ లకు జనాలు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
అందుకు కారణాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆ రెండు జిల్లాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి భారీగా హాజరు అవుతారు అంటూ భావించినా కూడా.. భారీగా ఖర్చు చేసినా కూడా వచ్చిన జనాలు చాలా తక్కువ. ఇటీవల బాబు సొంత నియోజక వర్గం లో మీటింగ్ ఏర్పాటు చేయగా మంచి జనాలు వచ్చారట. ఆ స్థాయిలో అయినా ఈ మీటింగ్ కు వస్తారేమో అని ఆశించారు చంద్రబాబు నాయుడు. కాని ఆయన ఆశ అడియాశ అయ్యింది. మరీ దారుణమైన జన సంఖ్య కనిపించడం తో ఆయన అవాక్కయ్యారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.