TDP : చంద్రబాబు చూస్తున్నావా? మరో కంచుకోట బద్దలవబోతోంది.. టీడీపీ భవిష్యత్తు అంధకారం కానుందా?
TDP : టీడీపీ పార్టీ అంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఏలిన పార్టీ. కానీ.. ఇప్పుడు టీడీపీ అంటే అటు తెలంగాణలో ఇటు ఏపీలో రెండు రాష్ట్రాల్లో అసలు టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో అయితే టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. టీడీపీకి అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఉన్న కంచుకోటలు కాస్త ఒక్కొక్కటిగా బద్దలు అవుతున్నాయి. ఒకప్పుడు టీడీపీకి అనంతపురం జిల్లా కంచుకోటగా ఉండేది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటే.
కానీ.. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీకి టీడీపీ తట్టుకోలేకపోయింది. అనంతపురం జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రం గెలిచింది టీడీపీ. అందులో ఒకటి బాలకృష్ణ నియోజ కవర్గం హిందూపురం, రెండోది ఉరవకొండ. ఈ రెండు నియోజకవర్గాల్లో తప్ప.. మిగితా ఏ నియోజక వర్గంలో టీడీపీ గెలవలేదు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలుస్తుందన్న నమ్మకం మాత్రం టీడీపీ నేతలకు కూడా లేదు. దానికి కారణం.. అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల మధ్య విభేదాలు.. వివాదాలు.
TDP : ఎవరికి వారే సొంత అజెండాను ఏర్పాటు చేసుకున్నారా?
అనంతపురం జిల్లాలోని కొన్ని కంచుకోటలను ఇప్పటికే వైసీపీ బద్దలు కొట్టింది. జేసీ వర్గం కావచ్చు.. పరిటాల కుటుంబం కావచ్చు.. కాలువ శ్రీనివాసులు కావచ్చు.. పల్లె రఘురాథరెడ్డి కావచ్చు.. ఎవరైనా సరే.. బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఇవేవీ పనిచేయవు అని స్పష్టం అవుతోంది. దానికి కారణం.. ఎవరికి వారే వర్గాలుగా విడిపోయి సొంత అజెండాను ఏర్పాటు చేసుకోవడం.
పలు నియోజకవర్గాల్లో ఓడిపోయిన నాయకులైతే పత్తా లేకుండా పోయారు. నిమ్మల కిష్టప్ప కూడా యాక్టివ్ గా లేరు. జేసీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత బలమైన కేడర్ ఉండి.. టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా ఇంతలా వీక్ అయిపోతుంటే వచ్చే ఎన్నికల్లో ఆ హిందూపురం.. ఉరవకొండ రెండింటిపై కూడా ఆశలు వదిలేసుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.