GST : సామాన్యుడి జేబుకు మరింత చిల్లు… జనవరి నుంచి పెరగనున్న ధరలు.. జీఎస్టీ ఎఫెక్ట్..!
GST : కొత్త బట్టలు, చెప్పులు కొనాలనుకునే వారికి కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. దుస్తులు, ఇతర వస్త్రాలు, పాదరక్షలపై పెంచిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ను రాబోయే కొత్త సంవత్సరం నుంచి అమలులోకి తీసుకు రానున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.వీటిపై ప్రస్తుతమున్న 5 శాతం జీఎస్‌టీని 12 శాతానికి పెంచింది.
పెరిగిన జీఎస్‌టీ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దుస్తుల విషయంలో ధర రూ.1,000లోపు ఉంటే 5% జీఎస్టీ… రూ.1,000 దాటితే 12% జీఎస్టీని వసూలు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ఇప్పటివరకు రూ.1000కు పైన ఉండే ఫుట్‌వేర్‌కు 5 శాతం జీఎస్టీ వర్తింపజేస్తుండగా..
ఇకపై ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల ఫుట్‌వేర్‌పై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ కామర్స్ సంస్థల్లో ఆన్ లైన్ ఆటో బుకింగ్ లతో పాటు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ పైన ఇకపై నేరుగా కస్టమర్ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నట్లు తెలిపింది.