Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తమ పాపులర్ బైకులు, స్కూటీలపై ధరలను గణనీయంగా తగ్గించింది. 350 సీసీకి తక్కువ సామర్థ్యం గల మోడళ్లపై వస్తు సేవల పన్ను తగ్గించడంతో ఈ ధరల తగ్గింపు జరిగింది.

#image_title
ఏ మోడల్‌కు ఎంత తగ్గింపు వచ్చిందంటే?
టీవీఎస్ జూపిటర్ 110 సీసీ స్కూటీ పాత ధర రూ.78,881గా ఉండగా రూ.6481 మేర తగ్గించింది. దీంతో ఈ స్కూటీ ధర రూ.72,400 గా ఉంది. జూపిటర్ 125 సీసీ స్కూటీ ధర రూ.82,395గా ఉండగా రూ.6795 మేర తగ్గించారు. కొత్త ధర రూ.75,600కు దిగివచ్చింది.ఎన్‌టార్క్ 125 టూవీలర్ పాత ధర రూ.88,142గా ఉండగా రూ.7242 మేర తగ్గించారు. దీంతో కొత్త ధర రూ.80,900 వద్దకు తగ్గింది.ఎక్స్‌ఎల్ 100 సీసీ ధర రూ.47,754 వద్ద ఉండగా రూ.4354 మేర తగ్గించారు. దీంతో కొత్త ధర రూ.43,400 వద్దకు దిగివచ్చింది.
రేయిడాన్ టూ వీలర్ పాత ధర రూ.59,950 మేర ఉండగా దీనిపై రూ.4850 మేర తగ్గించారు. దీంతో కొత్త ధర రూ.55,100 వద్దకు దిగివచ్చింది.స్పోర్ట్ టూ వీలర్ పాత ధర రూ.59,950 వద్ద ఉండగా రూ.4850 మేర తగ్గించారు. దీంతో కొత్త ధర రూ.55,100 వద్దకు దిగివచ్చింది.స్టార్ సిటీ బైక్ పాత ధర రూ.78,586 వద్ద ఉండగా రూ.6386 మేర తగ్గించారు. దీంతో కొత్త ధర రూ.72,200 వద్దకు తగ్గింది.రైడర్ బైక్ పాత ధర రూ.87,625 వద్ద ఉండగా రూ.6725 మేర తగ్గించారు. దీంతో కొత్త ధర రూ.80,900 వద్దకు దిగివచ్చింది.