Chettinad Prawn Pepper Recipe : రొయ్యలతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. చెట్టినాడ్ రెసిపీ చేసి చూడండి లొట్టలేయాల్సిందే
Chettinad Prawn Pepper Recipe : చాలా మందికి రొయ్యలు అంటే ఇష్టముంటుంది. ఎండు రొయ్యలు అంటే కొంత మంది పడిచస్తారు. మరి కొందరికి పచ్చి రొయ్యల కూర అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. పచ్చి రొయ్యల పులుసు, వేపుడు చాలా మందే ట్రై చేసి ఉంటారు. మీరు రొయ్యలతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా సైడ్ డిష్ చేసి చూడండి. మీరు చెట్టినాడ్ రెసిపీని ఇష్ట పడితే, రొయ్యలతో చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ ఫ్రైని ప్రయత్నించండి. ఈ చెట్టినాడ్ ష్రిమ్స్ పెప్పర్ ఫ్రై చేయడం చాలా ఈజీ అలాగే అందరికీ నచ్చి తీరుతుంది.
కావాల్సిన పదార్థాలు : రొయ్యలు ఉప్పు పసుపు మిరియాలు జీలకర్ర నూనె సొంపు దాల్చిన చెక్క ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వరమిళకాయ గరం మసాలా ముందుగా రొయ్యలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకుని కాస్తంత పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. రొయ్యలు కొద్దిగా కలర్ వచ్చాక వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ మిరియాలు, జీలకర్ర వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి వేడిగా అయ్యాక పొట్టు, ఇంగువ వేసి తాలింపు వేయాలి. తర్వాత ఉల్లిపాయ వేసి కాసేపు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి కలపాలి. తర్వాత నాన బెట్టిన రొయ్యలు వేసి కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మంచిగా వేడిగా అయ్యాక రొయ్యలు వేసి బాగా ఉడకనివ్వాలి అంతే.. సూపర్ టేస్టు ఉంటే చెట్టినాడ్ ష్రిమ్స్ పెప్పర్ ఫ్రై సిద్ధం అయినట్టే.