Chicken Biryani Recipe : అందరూ ఎంతో ఇష్టంగా తినే స్పెషల్ చికెన్ బిర్యానీ.. ఈ స్టైల్ లో చేశారంటే ఎవరికైనా నచ్చి తీరాల్సిందే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken Biryani Recipe : అందరూ ఎంతో ఇష్టంగా తినే స్పెషల్ చికెన్ బిర్యానీ.. ఈ స్టైల్ లో చేశారంటే ఎవరికైనా నచ్చి తీరాల్సిందే..!!

Chicken Biryani Recipe : ఈరోజు చికెన్ దమ్ బిర్యానిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను.. బట్ ఈ చికెన్ బిర్యాని సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఎవరికైనా కూడా నచ్చి తీరాల్సిందే.. అంత బావుంటుందండి. ఈ చికెన్ బిర్యాని ఎందుకు స్పెషల్ అంటే ఇన్స్టెంట్గా బయటనుంచి తెచ్చే మసాలా పౌడర్ కాకుండా ఫ్రెష్ గా అప్పుడే పచ్చి మసాలా నూరి యూస్ చేసి ఈ చికెన్ బిర్యాని చేస్తాము. చికెన్ అనేది డ్రై గా అయిపోకుండా […]

 Authored By jyothi | The Telugu News | Updated on :1 January 2024,8:00 am

Chicken Biryani Recipe : ఈరోజు చికెన్ దమ్ బిర్యానిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను.. బట్ ఈ చికెన్ బిర్యాని సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఎవరికైనా కూడా నచ్చి తీరాల్సిందే.. అంత బావుంటుందండి. ఈ చికెన్ బిర్యాని ఎందుకు స్పెషల్ అంటే ఇన్స్టెంట్గా బయటనుంచి తెచ్చే మసాలా పౌడర్ కాకుండా ఫ్రెష్ గా అప్పుడే పచ్చి మసాలా నూరి యూస్ చేసి ఈ చికెన్ బిర్యాని చేస్తాము. చికెన్ అనేది డ్రై గా అయిపోకుండా మంచి గ్రేవీగా వచ్చేలాగా పక్క కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యాని చేస్తున్నానండి.. దమ్ బిర్యాని ఎలా చేసుకోవాలో ఫటాఫట్ చూసేద్దాం.

దీనికి కావాల్సిన పదార్థాలు ; చికెన్, బాస్మతి రైస్, ఓల్ గరం మసాలా, పచ్చిమిర్చి, టమాటా, పెరుగు, కుంకుమపువ్వు, ఆయిల్, బటర్, కొత్తిమీర ,పుదీనా, బ్రౌన్ ఆనియన్ మొదలైనవి…
తయారీ విధానం : ఫస్ట్ దీని కోసం హాఫ్ కేజీ దాకా బాస్మతి రైస్ ని ఒక బౌల్ లో వేసుకుని శుభ్రంగాకడిగి నీళ్లు పోసేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. కనీసం అరగంటైనా నానపెట్టండి.. చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని లాస్ట్ లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకుని ఆ తర్వాత బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసం, కొంచం ఆయిల్ వేయండి. వీటన్నిటినీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. మీ టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు..

చికెన్ బిర్యాని లోకి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక ఇంచుదాక దాల్చిన చెక్క, నాలుగు లవంగ మొగ్గలు, రెండు యాలుకాయలు, ఒక నల్ల యాలుక, ఒక అనాసపు వేసుకోండి. జీలకర్ర ఒక టీ స్పూన్, గసగసాలు ,ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకులు వేసుకోండి. వీటిని పైన్ పౌడర్ గా ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఆడ్ చేసుకోండి. దానిలో రెండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ ల సిద్ధం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టౌ పై ఒక్కడైనా పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. బట్టర్ కరిగిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రిడియంట్స్ తీసుకుని అన్నిటిని కలిపి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి..ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా నూరుకుని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని రెండు టేబుల్ స్పూన్ల దాకా క్రష్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో నిదానంగా ఈ చికెన్ ని కుక్ అవ్వనివ్వాలి. చికెన్ ఉడికే లోపు బాస్మతి రైస్ ని కుక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి రెండు లీటర్ల దాకా నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి షాజీరా తో పాటుగా అన్ని హోల్ బిర్యానీ ఇంగ్రిడియంట్స్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యాని మసాలా నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి.

ఇందులోనే రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాక ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఒక టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసి ఒకసారి గరిటతో కలుపుకొని హై ఫ్లేమ్ లో పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొంచెం గ్యాప్ తో మూత పెట్టి మరిగించండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని దాంట్లో వేయాలి. అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ 90% ఆల్మోస్ట్ కుక్ అయ్యేంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ అంతా కూడా వేసేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్ లో మీరు సాల్ట్ గాని కారాన్ని గాని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లోసన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని క్రష్ చేసుకుని వేసుకోండి. ఈలోపు రైస్ ని చెక్ చేసుకుందాం. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మీరు చేత్తో చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక స్ట్రైన తీసుకుని రైస్ చేసి వాటర్ లేకుండా ఈ చికెన్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. సగం రైస్ వేసిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసి దీనిపైన కలర్ ఫుల్ గా కనిపించడం కోసం మిల్క్ గాని ఫుడ్ కలర్ వేసిన మిల్క్ ని గాని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మిగిలిన రైస్ ని ఇంకొక లేయర్ కింద స్ప్రెడ్ చేసేసి పైన కొత్తిమీర పుదీనా ఇంకా బ్రౌన్ ఆనియన్ కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ తో గార్నిష్ చేయండి. లాస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసేసి టైట్ గా ఉండే మూతను పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బిర్యానీని మనం 10 టు 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా స్టవ్ మీద పెడితే అడుగు మీకు కొంచెం డ్రై గా అయిపోతుంది. అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని స్టవ్ మీద ఫస్ట్ పెనాన్ని పెట్టి పెనాన్ని హిట్ అయిన తర్వాత దానిపైన ఈ బిర్యానీ పాట్ ని పెట్టి దమ్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో ఒక 10 టు 15 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే మీకు చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్ గా ఉంటుందన్నమాట. 15 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటతో ఒకసారి చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఇలా ఒక 10 మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి యమ్మీ యమ్మీ గా టేస్టీ టేస్టీగా రైస్ అనేది పొడిపొడి లాడుతూ చికెన్ తో చికెన్ దమ్ బిర్యాని రెడీ అయిపోతుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది