Chicken Biryani : బిర్యానీ తిని యువతి మృతి.. ఎక్కడో తెలుసా? బిర్యానీ తింటే చనిపోతారా?
Chicken Biryani : చాలామందికి ఫేవరేట్ ఫుడ్ ఏది అంటే టక్కున బిర్యానీ అని చెబుతాం. ఎందుకంటే.. బిర్యానీలో నిజంగానే అంత టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి చికెన్ బిర్యానీ కాగా, మరొకటి మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ.. ఇలా పలు రకాల బిర్యానీలు ఉంటాయి. ఏ బిర్యానీ టేస్ట్ దానితే. అసలు హైదరాబాద్ బిర్యానీ దొరకని ప్లేస్ ఉండదు అంటే నమ్మండి. అయితే.. ఓ యువతి బిర్యానీ తిని చనిపోయింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.
ఈ ఘటన కేరళలోని కాసర్ ఘడ్ లో చోటు చేసుకుంది. అంజుశ్రీ అనే 20 ఏళ్ల యువతి డిసెంబర్ 31న రాత్రి రొమాన్సియా అనే హోటల్ లో కుజుమంతీ అనే పేరు ఉన్న బిర్యానీని ఆర్డర్ చేసుకుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. బిర్యానీ పార్శిల్ వచ్చిన తర్వాత దాన్ని తిన్నది. బిర్యానీ తినగానే తనకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో తనను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ తనకు అక్కడ నయం కాలేదు. దీంతో వెంటనే మంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Chicken Biryani : చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన అంజుశ్రీ
అయితే.. అంజుశ్రీ అక్కడ చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు బిర్యానీ తినడం వల్ల చనిపోయిందని ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని కోరడంతో వెంటనే కేరళ ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. దీంతో ఆ హోటల్ లో తయారు చేసిన బిర్యానీకి సంబంధించి టెస్ట్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని.. అందుకే అంజుశ్రీ చనిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.