Chicken Fry : చికెన్ ఫ్రై.. ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తే 15 రోజులు పక్కాగా నిల్వ ఉంటుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Fry : చికెన్ ఫ్రై.. ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తే 15 రోజులు పక్కాగా నిల్వ ఉంటుంది…

 Authored By aruna | The Telugu News | Updated on :23 September 2022,7:00 am

Chicken Fry : చికెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చికెన్ ని సాధారణంగా ఎక్కువగా బిర్యానీలు, పులుసు, కూరలు, పచ్చడి చేసుకొని రెండు మూడు రోజులలో ఫినిష్ చేస్తూ ఉంటాం. అయితే ఈ చికెన్ తో చికెన్ ఫ్రై చేసి పక్కాగా 15 రోజులు నిల్వ ఉండేలా తయారు చేసుకుందాం…

కావలసిన పదార్థాలు : చికెన్, కారం, ఉప్పు, పసుపు ,కరివేపాకు, కొత్తిమీర గరం మసాలా, ధనియా పౌడర్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ఆయిల్ పచ్చిమిర్చి, మొదలైనవి… తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో బోన్ లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి బాగా పిసుకుతూ కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి నైట్ అంతా..

Chicken Fry If you fry chicken in this way it can be stored for 15 days

Chicken Fry If you fry chicken in this way, it can be stored for 15 days

ఇక తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం కరివేపాకు వేసి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను వేసి అవి కొంచెం వేగిన తర్వాత నైట్ అంతా ఫ్రిజ్లో ఉంచుకున్న చికెన్ తీసుకొని దాంట్లో వేసి ఒక 15 నిమిషాల పాటు క్రిస్పీగా వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర ,వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు స్టవ్ పై ఉంచి తర్వాత స్టవ్ పై నుంచి దింపి చికెన్ ఫ్రై ని సర్వ్ చేసుకోవడమే… అంతే ఎంతో సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ. ఇది పక్కాగా 15 రోజులు నిల్వ ఉంటుంది. దీనిని పప్పుచారులోకి, సాంబార్ లోకి, సైడ్ డిష్ గా పెట్టుకొని తింటే దీని రుచి వేరే లెవెల్ లో ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది