ChandraBabu : అతి పెద్ద స్కామ్ లో చంద్రబాబు.. CID విచారణ…!
ChandraBabu : 2014 లో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కొత్త ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రాగానే.. చంద్రబాబు కొత్త రాష్ట్రం కాబట్టి.. రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చాలా పనులను ప్రారంభించారు. చాలా అభివృద్ధి పనులు ప్రారంభించడంతో కొన్ని పనుల్లో అవినీతి జరిగిందంటూ అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు కోడై కూశాయి. ముఖ్యంగా గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో అవినీతి జరిగిందని
చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.ఆ అవినీతి ఆరోపణలపై సీఐడీ త్వరలో విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై గుంటూరు మేయర్ కూడా తాజాగా స్పందించారు. మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. దీనిపై ఖచ్చితంగా విచారణ కోరుతామన్నారు. గుంటూరులో టీడీపీ హయాంలో భూగర్భ డ్రైనేజీ పనులు నిర్వహించారని.. దాంట్లో చాలా అక్రమాలు జరిగాయని అందుకే దానిపై సీఐడీ విచారణ చేయిస్తామని అన్నారు. అంతే కాదు..!
ChandraBabu : త్వరలో నగరం మొత్తానికి భూగర్భ డ్రైనేజీ పనులు
కొత్త రాజధాని అంటూ కేవలం రాజధాని డెవలప్ మెంట్ పేరుతో అసలు గుంటూరు అభివృద్ధినే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే.. త్వరలోనే గుంటూరు నగరానికి మొత్తం భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం అవుతాయని మేయర్ అన్నారు. అలాగే.. అత్యాధునిక సౌకర్యాలలో కబేళా, టిడ్కో గృహాలకు తాగునీరు, ఇలా పలు రకాల అభివృద్ధి కోసం రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయిన కమిషన్ కీర్తి స్పష్టం చేశారు. అలాగే.. గత ప్రభుత్వంలో జరిగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవహారంలో మాత్రం సీఐడీ విచారణ కోరుతామని తెలిపారు.