CM YS Jagan : నిన్న గవర్నర్ తో భేటీ… ఐదుగురు మంత్రులకు ఊహించిన షాక్ ఇవ్వబోతున్న సీఎం జగన్..!!
CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం తెలిసిందే. వైసీపీ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో సైతం టీడీపీ పుంజుకుంది. మరోపక్క వచ్చే ఎన్నికలను సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవటం వెనకాల వైసీపీ నేతల పనితీరు సరిగ్గా లేదని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పైగా ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు తన మంత్రివర్గంలో దీటుగా కౌంటర్లు ఇచ్చేవారు కూడా సరిగ్గా లేరని భావించిన జగన్ ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమయ్యారట. అందువల్లే నిన్న ఏపీ గవర్నర్ తో భేటీ అయ్యారు అని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఐదుగురు మంత్రులకు ఉద్వాసన కల్పించి వారి స్థానంలో.. కొడాలి నానిని మళ్ళి తీసుకోవడానికి జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థులలో కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికల ఆధారంగానే మంత్రివర్గ విస్తారణ చేపట్టి..
వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనే ప్లాన్ జగన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోల్పోకుండా జగన్ పదునైన వ్యూహాలతో టీడీపీనీ దెబ్బ కొట్టడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి చంద్రబాబును ఓడిస్తే ఇంకా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని.. జగన్ ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారట. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు మంత్రివర్గంలో నుండి అయిదుగురిని పక్కన పెట్టేయడానికి జగన్ రెడీ అవుతున్నట్లు వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.