ప్రధాని మోదీని పొగడ్తల్లో ముంచెత్తిన సీఎం కేసీఆర్.. ఏంటి రూటు మారింది?
నిన్ననే కదా… కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నిర్వహించిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. మద్దతు తెలపడమే కాదు.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపారు. కొత్త వ్యవసాయ బిల్లులు.. రైతుల పాలిట శాపం అన్నారు.
కట్ చేస్తే… ఇవాళ ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఆకాశానికెత్తారు. ప్రధానిమోదీకి లేఖ రాసిన కేసీఆర్… సెంట్రల్ విస్టా ప్రాజెక్టు విషయంలో తెగ పొగిడేశారు.
దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేసే ప్రాజెక్టు సెంట్రల్ విస్టా అని.. అటువంటి ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయడం గర్వకారణం అంటూ కేసీఆర్.. ప్రధానిని అభినందించారు.
సెంట్రల్ విస్టా అంటే ఏంటో తెలుసా?
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అంటే మరేంటో కాదు.. పార్లమెంటు కొత్త భవనం, కేంద్ర మంత్రిత్వ శాఖలకు కొత్త భవనాలను నిర్మించడం. వాటి నిర్మాణం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టే సెంట్రల్ విస్టా. దీనికి సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ.. వెంటనే ఇప్పుడు ఉన్న పాత బిల్డింగులను కూల్చేయొద్దంటూ ఆదేశించింది.
మరోవైపు ప్రధాని మోదీ.. రేపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులతో పాటు.. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కూడా హాజరు కానున్నారు.
రేపు శంకుస్థాపన నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి లేఖ రాయడం సర్వత్రా ఆసక్త నెలకొన్నది.
CM Sri KCR, in a letter addressed to PM Sri @narendramodi, wished for speedy completion of #CentralVistaProject on the eve of its foundation stone laying ceremony. Termed the Project a symbol of self-esteem, prestige and pride of a resurgent, confident and strong India. pic.twitter.com/QJTRoylrwn
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2020
Hon'ble CM stated that #CentralVista is a nationally important project and is long overdue adding that the existing government infrastructure in the capital is inadequate and is also associated with India's colonial past.
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2020