KCR : ఆ పూజ వల్ల రాజకీయాల్లో మహాశక్తిమంతుడిగా కేసీఆర్? ఆయన్ను టచ్ చేసే మగాడే ఉండడట? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : ఆ పూజ వల్ల రాజకీయాల్లో మహాశక్తిమంతుడిగా కేసీఆర్? ఆయన్ను టచ్ చేసే మగాడే ఉండడట?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా ఏం చేసినా ముందూ వెనక చూసి చేస్తారు. తొందరపడరు. అడుగేసే ముందు వందసార్లు ఆలోచిస్తారు. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పిదాలను చేస్తుంటారు సీఎం కేసీఆర్. అయినా కూడా ఆయన రాజకీయ చతురత ముందు మరెవ్వరూ పనికిరారు. ఏ రాజకీయ నాయకుడు అవలంభించని విధానాలను కేసీఆర్ పాటిస్తుంటారు. ఆయనకు దేవుడన్నా.. పూజలన్నా భక్తి ఎక్కువ. సాధారణంగా రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది నాస్తికులే ఉంటారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 January 2021,9:31 pm

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా ఏం చేసినా ముందూ వెనక చూసి చేస్తారు. తొందరపడరు. అడుగేసే ముందు వందసార్లు ఆలోచిస్తారు. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పిదాలను చేస్తుంటారు సీఎం కేసీఆర్. అయినా కూడా ఆయన రాజకీయ చతురత ముందు మరెవ్వరూ పనికిరారు.

cm kcr performed powerful puja to become strong in politics

cm kcr performed powerful puja to become strong in politics

ఏ రాజకీయ నాయకుడు అవలంభించని విధానాలను కేసీఆర్ పాటిస్తుంటారు. ఆయనకు దేవుడన్నా.. పూజలన్నా భక్తి ఎక్కువ. సాధారణంగా రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది నాస్తికులే ఉంటారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం పరమభక్తుడు. దేవుడి పూజలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆయన ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు. కొన్ని పూజలు ఆయనకు బాగానే కలిసివచ్చాయి. అందులోనూ ఆయన చేసే పూజలేవీ సామాన్యమైనవి కావు. చాలా పవర్ ఫుల్ పూజలు. ఎంతో నియమం, నిష్ఠతో చేసేటువంటి పూజలు అవి. ఎంతటి కఠినమైన పూజలైనా చేసేందుకు రెడీ అంటారు కేసీఆర్.

ఆ మధ్య విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో తన ఫామ్ హౌస్ లో ఓ పూజ చేయించారు కేసీఆర్. అప్పట్లో ఆ పూజ తెలంగాణ మొత్తం చర్చనీయాంశం అయింది. అంతకు ముందు కూడా చండీయాగాలను జరిపించారు కేసీఆర్.

భగళాముఖి పూజలు కూడా నిర్వహించిన కేసీఆర్

ఈ మధ్య భగళాముఖి అనే పూజను తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ నిర్వహించారు అనేది ప్రచారంలో ఉంది. అది మామూలు పూజ కాదు. ఆ పూజా విధానం దాదాపుగా ఏ అర్చకుడికీ తెలియదు. ఆ పూజ కోసం ప్రత్యేకంగా నేర్చుకొని చేయాల్సి ఉంటుంది. భగళాముఖి పూజ చాలా శక్తిమంతమైనదట. దాన్ని ఏమాత్రం అడ్డంకులు లేకుండా.. నిష్ఠతో చేయాలట. అంతే కాదు.. ఆ పూజ చేశాక.. ఆ పూజకు ఉపయోగించిన ద్రవ్యాలను తీసుకెళ్లి నదిలో కలపాలి. అప్పుడే ఆ పూజ ప్రతిఫలం దక్కుతుంది. అందుకే.. ఆ మధ్య సీఎం కేసీఆర్ సతీసమేతంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లారని.. ఆయన వెళ్లింది.. పూజకు ఉపయోగించిన వాటిని నదిలో కలపడానికని.. ప్రాజెక్టును చూడటానికి కాదని వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

కట్.. చేస్తే భగళాముఖి పూజ తర్వాత కేసీఆర్ మరో పూజను కూడా చేశారట. అయితే.. ఈ సారి కేసీఆర్ కూతురు కవిత, కేసీఆర్ సతీమణి, తమ బంధువులు అందరూ కలిసి కాశికి వెళ్లారు. అక్కడ గంగా నదిలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అది కూడా పూజేనని.. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన మహిళలు మాత్రమే ఆ పూజలో పాల్గొన్నారు. ఈ పూజ చేయడం వల్ల సీఎం కేసీఆర్ కు తిరుగు ఉండదని.. రాజకీయాల్లో ఇక తనను మించిన వాళ్లు ఉండరన్న నమ్మకంతో నిర్వహించారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

వాటిలో నిజమెంత? అబద్ధమెంత? అనే విషయం తెలియనప్పటికీ.. ఎమ్మెల్సీ కవిత, తమ బంధువులు మాత్రం కాశీలో పెద్ద ఎత్తున్నే పూజను నిర్వహించారు. వాళ్ల పూజకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది