YS Jagan : ఏపీ వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్… సీఎం జగన్ సంచలన నిర్ణయం?
YS Jagan : దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించినా అవి అసలైన లబ్ధిదారులకు అందడం లేదని గ్రహించి… వాటిని లబ్ధిదారులకు అందేలా చేసేందుకు ఒక ప్రతినిధి కావాలని.. ఆ ప్రతినిధి కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వారైతే… లబ్ధిదారులకు ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని గ్రహించిన సీఎం జగన్… ఏపీలో తను అధికారంలోకి రాగానే… ముందు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించారు. వాళ్ల ద్వారానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
అయితే… వాలంటీర్లు పనితీరుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. కావాలని రాజకీయంగా వాలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటోంది అనే ఆరోపణలు మొదటినుంచి ఉన్నాయి. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అధికార వైఎస్సార్సీపీ పార్టీని ఇరుకున పెట్టాలని తెగ ప్రయత్నిస్తున్నారు. నిజానికి వాలంటీర్ల వల్ల అధికార పార్టీ నేతలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వాళ్ల పనితీరుపై అధికార పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
YS Jagan : ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాలంటీర్లపై కఠిన చర్యలు
కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే అపవాదు కూడా ఈమధ్య వస్తోంది. ఈ విషయం సీఎం జగన్ వరకూ వెళ్లిందట. మొన్న జరిగిన తిరుపతి ఉపఎన్నికల్లోనూ కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శ ఉంది. దీనిపై సీఎం జగన్ కూడా సీరియస్ అవడంతో పాటు… ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్ల పనుల పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులను నియమించే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారట. దాని కోసం ఒక కమిటీని వేసి… ఆ కమిటీ వాలంటీర్ల పనులను పర్యవేక్షిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో తహసీల్దార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అవుతుంది. వాళ్ల పనితీరును తహసీల్దార్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ… ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంటారు. ఎవరైతే వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో.. సమర్థంగా పనిచేయరో వాళ్లను వెంటనే విధుల నుంచి తప్పించేలా సీఎం జగన్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారట. ఏపీలోని ప్రతి మారుమూల పల్లెకు కూడా నేడు వాలంటీర్లు ఉన్నారు. కానీ.. ప్రభుత్వం ప్రారంభించే సంక్షేమ పథకాలు మాత్రం మారుమూల పల్లెకు చేరడం లేదనేది వాస్తవం. ఆ విషయంపై సీఎం జగన్ బాగానే సీరియస్ అయి… వాలంటీర్ల మీద శ్రద్ధ పెడుతున్నారు.