Health Tips | కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ రసం..ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
ప్రధానాంశాలు:
Health Tips | కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ రసం..ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ నీరు మొదటి స్థానాల్లో నిలుస్తాయి. ఇవి రెండూ సహజమైనవి, అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది చాలామందికి కలిగే సందేహం.

#image_title
కొబ్బరి నీటి ప్రయోజనాలు:
కొబ్బరి నీటిలో అధిక నీరు & సహజ ఎలక్ట్రోలైట్లు (పొటాషియం, మెగ్నీషియం) ఉన్నాయి.వేడికాలంలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.వ్యాయామం చేసిన తర్వాత శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయడానికి సరైనదే.ఆకలిని నియంత్రించి తక్కువగా తినేందుకు సహాయపడుతుంది.ఇందులో ఉన్న పొటాషియం రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది.మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నిమ్మకాయ నీటి ప్రయోజనాలు చూస్తే.. అధిక విటమిన్ C ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అజీర్ణం, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.ఆకలిని నియంత్రించి, అధిక కేలరీల ఆహారాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది.ఇవి రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానీ మీ శరీర అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు