Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు..!
ప్రధానాంశాలు:
Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు..!
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారిన సమయంలో వినియోగదారులకు ఊరట కలిగించే శుభవార్త అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.911గా ఉండగా, డెలివరీ ఛార్జీలు కలుపుకుని ఇది దాదాపు రూ.950కు చేరుతోంది. అంతేకాక సబ్సిడీ రాకపోవడంతో ప్రజలపై భారం మరింత పెరిగింది.

Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు..!
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే ఐదు ఆఫర్లు.. ఏంటో చుసేయ్యండి !
అయితే ఈ పరిస్థితుల్లో కొంత తక్కువ ధరకు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని పేటీఎం అందిస్తోంది. పేటీఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసేవారికి ఐదు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ కార్డుల ద్వారా బుకింగ్ చేస్తే 5% తగ్గింపు (గరిష్టంగా రూ.150 వరకు) పొందవచ్చు. ఫెడరల్150 అనే ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే RBL బ్యాంక్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ యూజర్లకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. దీనికీ ప్రత్యేక ప్రోమో కోడ్లు ఉన్నాయి.
ఈ తగ్గింపు ఆఫర్లతో పాటు గ్యాస్ బుకింగ్ చేసేవారికి బస్ లేదా ఫ్లైట్ టికెట్లపై అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. రైడ్300 కోడ్ ఉపయోగిస్తే రూ.300 విలువైన బస్ టికెట్ వోచర్, ఫ్లై750 కోడ్‌తో రూ.750 విలువైన ఫ్లైట్ టికెట్ వోచర్ లభిస్తుంది. ఈ ఆఫర్లు పేటీఎం యాప్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. తక్కువ ఖర్చుతో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉన్నందున, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.