Gas Cylinder : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చిన సర్కార్..!
ప్రధానాంశాలు:
గ్యాస్ లబ్దిదారులకు పెద్ద ఊరట కల్పించిన చంద్రబాబు
Gas Cylinder : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చిన సర్కార్..!
Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తరువాత పూర్తిగా డబ్బు చెల్లించి, తర్వాతే రాయితీ సొమ్ము తమ ఖాతాలో జమవ్వడం జరిగేది. అయితే ఇకపై, లబ్ధిదారుడు సిలిండర్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ మొత్తం డిజిటల్ వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాలో ముందుగానే జమ అవుతుంది. దీంతో గ్యాస్ తీసుకునే సమయంలో ఏ రూపాయి ముందస్తు చెల్లింపు అవసరం లేకుండా, మహిళలకు ఆర్థికంగా ఊరట కలిగించే విధంగా మారనుంది.

Gas Cylinder : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చిన సర్కార్..!
Gas Cylinder : గ్యాస్ లబ్దిదారులకు పెద్ద ఊరట కల్పించిన చంద్రబాబు
ఈ కొత్త విధానాన్ని ప్రాథమికంగా గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్, గుంటూరు నగరాల్లోని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలతో కలసి ఈ ప్రయోగాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో చేపట్టారు. ప్రభుత్వ సేవల ప్రామాణికతను పెంచేందుకు, ప్రజలకు మరింత సులభతరం చేసే దిశగా ఈ మార్పును చూస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం “దీపం 2” పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. కానీ రాయితీ జమ కావడంలో తేడాలు, ఆలస్యం వల్ల వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజా విధానం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాయితీ డబ్బు ముందే లభించడంతో మహిళలు ఏ సంకోచం లేకుండా గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశాన్ని పొందుతారు. దీని ద్వారా పథకంపై నమ్మకం పెరిగి, ప్రజల భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉంది.