congress : బలమైన నేత కోసం వెతుకులాట.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

congress : బలమైన నేత కోసం వెతుకులాట..

 Authored By sukanya | The Telugu News | Updated on :7 August 2021,12:35 pm

congress ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైసిపి ఖాతాలో పడిపోయేలా చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దాంతో పాటు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి ఏపి వాసులకు తీరని ద్రోహం కాంగ్రెస్ చేసిందనే మాట చరిత్రలో నిలిచిపోయింది. అయితే congress కాంగ్రెస్ చేసిన గాయం బిజెపి చెరిపే పని చేసిందా అంటే గత ఏడేళ్ళు గా అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. అయితే గతకొంతకాలం క్రితం బిజెపి దూకుడుగా వెళ్ళే సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసి ఏదైనా అవకాశం చిక్కక పోతుందా అని ఎదురుచూస్తోంది.

congress high command focus on gv harsha kumar

congress high command focus on gv harsha kumar

మరోపక్క కాంగ్రెస్ రఘువీరారెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాధ్ కి పగ్గాలు అప్పగించి చూసింది. కానీ సాకే శైలజానాథ్ వల్ల కూడా పార్టీకి ఎలాంటి ఊపు కనిపించడం లేదు. తాజాగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసే ఆలోచన షురూ చేసింది. దీంతో ఏపికి కూడా నిత్యం ప్రజల్లో ఉండే చురుకైన నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.

హర్ష కుమార్ దిశగా.. congress

ఈ వే లో అమలాపురం మాజీ ఎంపి జివి హర్ష కుమార్ సరైన వ్యక్తిగా కాంగ్రెస్ అధిష్టానానికి చేరినట్లు సమాచారం. విభజన తరువాత పార్టీనుంచి బహిష్కరించబడి ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన హర్షకుమార్ మళ్లీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టిడిపి లో చేరి ఆ వెంటనే వెనక్కి వచ్చి కొంత కాలంగా మౌనం ఆశ్రయించారు. అయితే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన కేసులకు సైతం వెరవకుండా వ్యతిరేక పోరాటం చేస్తూనే వచ్చారు. తమ సహచరులు, సన్నిహితుల వత్తిడితో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న హర్ష కుమార్ ప్రజల్లో పార్టీకి మైలేజ్ లేకపోయినా ఏదో ఒక ఉద్యమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

congress high command focus on gv harsha kumar

congress high command focus on gv harsha kumar

ఏపి లో దళితుల సమస్యలు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రత్యక్షమై, ఉద్యమ బాటలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హర్షకుమార్ కు పీసీసీ పీఠం అప్పగిస్తే, వైసీపీకి ఇబ్బందులు తలెత్తే అవకాశంతో పాటు కోస్తాలో బలమైన ఎస్సీ వర్గాన్ని కాంగ్రెస్ కు దగ్గర చేస్తారని అధిష్టానం యోచిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరి దీనిపై ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఏమంటారన్నదే చర్చనీయాంశంగా మారింది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది