congress mp revanth reddy press meet
Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆయన విమర్శించారు. ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని.. కరోనా కేసులను తగ్గించి చూపిస్తోంది. అందుకే రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు, మెడిసిన్లను కేంద్రం ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువగా పంపుతోంది. అసలు.. కరోనా వ్యాక్సిన్ తయారయ్యేదే తెలంగాణలో. కానీ.. తెలంగాణలోనే కరోనా వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది. తెలంగాణలో తయారవుతున్నప్పుడు.. తెలంగాణ అవసరం తీరకుండా… బయటికి ఎలా పంపిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేదే రెండు కంపెనీలు. మరే ఇతర కంపెనీలకు అనుమతి ఇవ్వలేదు. మరి.. రెండు కంపెనీలే వ్యాక్సిన్లను తయారు చేస్తుంటే.. ఎందుకు గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నారు.. అంటూ రేవంత్ రెడ్డి Revanth Reddy ప్రశ్నించారు.
congress mp revanth reddy press meet
తెలంగాణలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కేసీఆర్ బంధువులవే. అటువంటప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చుతారు. అందుకే చేర్చడం లేదు. అలాగే… వ్యాక్సిన్ కొనుగోలుపై, కరోనా మందులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీలో ఉన్న సభ్యులు మరెవరో కాదు.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారి రాజశేఖర్ రెడ్డి. వీళ్లంతా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ అయితే.. ఎక్కడ చూసినా ఉండారు కానీ.. కరోనాను నియంత్రించడంలో మాత్రం శూన్యం. కొనుగోళ్లు అంటే చాలు.. కేటీఆర్ వచ్చేస్తారు. అంతే… కేటాయింపులు, కొనుగోళ్లు అంటే ముందుండేది ఇద్దరే ఇద్దరు.. ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్ రావు. అసలు.. దోపిడీ కోసం, దోచుకోవడం కోసం వెసులుబాటు ఉన్న ఏ మంత్రిత్వ శాఖ అయినా కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉంటుంది. అందుకే కదా.. ఈటలను తొలగించింది.. ఈటలను తొలగించడానికి కారణం కూడా అదే.. అంటూ రేవంత్ రెడ్డి Revanth Reddy ఎద్దేవా చేశారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.