AP Congress : ఆంధ్రప్రదేశ్ లో కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో ప్రక్షాళన ప్రారంభించనుంది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ తరహాలోనే ఫైర్ బ్రాండ్ పీసీసీ ఛీఫ్ ఎంపికతో పాటు పలు కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని నేతలకు సంకేతాలు పంపుతున్నారు. త్వరలో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీలో సీనియర్లతో ముందుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్లను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీ రాహుల్ గాంధీతో సమావేశానికి రావాలని వీరిని ఆహ్వానిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రతి నేతతో మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను మార్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. శైలజా నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడం సాధ్యం కాదని భావిస్తున్న హైకమాండ్.. ఆయన స్ధానంలో రేవంత్ రెడ్డి తరహా నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడి, మళ్లీ పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని లీడ్ తీసుకోవాలని అధిష్టానం కోరే అవకాశముంది. ప్రస్తుతం రెడ్ల నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇందుకు కౌంటర్ గా కిరణ్ ను పీసీసీ ఛీఫ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై రాహుల్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీ సీనియర్లు ఏమంటారన్నదే కీలకంగా మారింది. ఇక గతంలో పీసీసీ ఛీఫ్ గా పనిచేసిన రఘువీరారెడ్డి .. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. తాజాగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే రఘువీరారెడ్డి.. చూపు వైసీపీవైపు ఉందంటూ గతంలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే రఘువీరారెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సైలెంట్ లో ఉన్న సీనియర్లు మళ్లీ కదలివస్తారో లేదో మాత్రం వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.