Nagarjuna Sagar Bypoll : నాకొద్దు.. నాకొడుకు వద్దు.. సాగర్ టికెట్ పై జానారెడ్డి సంచలన కామెంట్స్?
Nagarjuna Sagar Bypoll : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ నాగార్జునసాగర్ చుట్టూనే తిరుగుతున్నాయి. త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ప్రధాన పార్టీలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తాను చాటాలని చూస్తోంది. బీజేపీ కూడా అంతే. వరుస విజయాలతో దూసుకుపోతోంది. సాగర్ లో కూడా గెలిస్తే.. ఇక తమకు తిరుగులేదని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులోనూ నాగార్జునసాగర్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. 2018 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ చేతుల్లోనుంచి సాగర్ చేజారిపోయింది కానీ.. ఎక్కువసార్లు గెలిచింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే.
నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనేపథ్యంలో నాగార్జునసాగర్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డిని బరిలోకి దింపాలని అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. కానీ.. జానారెడ్డి మాత్రం తాను పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డిపై కన్నేసిన బీజేపీ : Nagarjuna Sagar Bypoll
అయితే.. బీజేపీ మాత్రం జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డిపై కన్నేసింది. ఎలాగైనా రఘువీర్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకొని… సాగర్ టికెట్ ఇచ్చి.. గెలిపించాలని తెగ ప్రయత్నిస్తోంది. కానీ.. అది వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో జానారెడ్డి మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో నా కొడుకు రఘువీర్ రెడ్డిని బరిలో ఉంచుదామని అనుచరులు చెబితే నాకేమీ సమస్య లేదు. లేదా నా అనుచరుల్లో ఎవరైనా పోటీలో ఉన్నా కూడా వారికి నా మద్దతు తప్పకుండా ఉంటుంది. నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం.. అంటూ ప్రకటించడం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశమైంది.