Snake Guard | పొట్లకాయ ఉపయోగాలు తెలుసా? .. చిన్న కాయలో అనేక ఆరోగ్య రహస్యాలు!
Snake Guard | చిన్నగా కనిపించే పొట్లకాయ (Snake Gourd) లో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి అమోఘమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ కాయను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పలు వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.
#image_title
క్యాన్సర్ నిరోధక గుణాలు
పొట్లకాయలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల నిరోధించబడుతుంది. అలాగే ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది.
గుండెకు రక్షణ కవచం
గుండె సంబంధిత వ్యాధుల నివారణలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సహజ ఎంజైములు గుండెను ఆరోగ్యంగా ఉంచి, హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అధికంగా ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. కామెర్లు తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరం. ధనియాలతో కలిపి తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
జ్వరం తగ్గించడంలో సహాయపడుతుంది
పొట్లకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు జ్వరాన్ని తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ కాయలను తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద ప్రకారం, పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దినా కూడా జ్వరం తగ్గుతుందని చెబుతారు.