Corona Second Wave : కరోనా సెకండ్ వేవ్ ఎంత డేంజర్ అంటే… 24 గంటల్లోపే ఊపిరితిత్తలు మటాష్?
Corona Second Wave : కరోనా సెకండ్ వేవ్.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే అందరికీ దడ పుడుతోంది. గత సంవత్సరం ఇదే సమయానికి కూడా కరోనాపై పోరు జరుగుతోంది. కానీ.. ఆ కరోనాను ఎలాగోలా తరిమికొట్టాం. కానీ… దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే వణికిస్తోంది. కొత్త రకం కరోనా స్ట్రెయిన్… గత సంవత్సరం కరోనా కన్నా చాలా డేంజర్ అట. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్… ఎంత ఉద్ధృతంగా ఉందో అందరం చూస్తున్నాం. కొత్త రకం కరోనా ఎంత డేంజర్ అంటే… అది ఎక్కువగా యూత్ కు, చిన్నపిల్లలకే సోకడం కాకుండా… శరీరంలోకి వెళ్లిన వెంటనే లోపల ఉన్న అవయవాలపై దాడి చేస్తోంది. అందుకే కొత్తరకం కరోనాకు అందరూ భయపడాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక.. ఈ కొత్త రకం కరోనా వైరస్ లక్షణాలు అయితే ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఒకరికి రుచి, వాసన కోల్పోతే.. ఇంకొకరికి దగ్గు, జ్వరం రావడం… ఇంకొందరికి నాలుక రంగు మారడం.. ఇలా పలు రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఓకే కానీ.. అసలు ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ వల్ల ఉండే అసలు డేంజర్ ఏంటో తెలుసా? ఊపిరితిత్తులు పాడవ్వడం. అవును… ఈ కొత్త రకం కరోనా.. శరీరంలోకి వెళ్లిన 24 గంటల్లోపే ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందట. ఊపిరితిత్తులపై దాడి చేసి వాటికి పాడు చేస్తుందట.
Corona Second Wave : రాజస్థాన్ లో 32 ఏళ్ల మహిళ ఊపిరితిత్తులు పాడు అయి చనిపోయింది
దానికి ఉదాహరణగా డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు… రాజస్థాన్ కు చెందిన ఓ మహిళకు జరిగిన విషయాన్ని చెబుతున్నారు. రాజస్థాన్ లోని కోటాకు చెందిన 32 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. అయితే… కరోనా సోకిన 24 గంటల్లో తన ఊపిరితిత్తులు రెండూ పాడయిపోయాయట. తనకు రొమ్ము దగ్గర నొప్పిగా ఉందని డాక్టర్లను చెప్పడంతో వాళ్లు వెంటనే ఎక్స్ రే తీశారట.. ఎక్స్ రే చూసి డాక్టర్లే ఖంగు తిన్నారట. ఊపిరితిత్తులు 80 శాతం పాడైపోయాయట. అంతకుముందు రోజు ఎక్స్ రే తీస్తే సక్రమంగా పనిచేసిన ఊపిరితిత్తులు 24 గంటల్లోనే పాడైపోయాయంటే దానికి కారణం ఈ కరోనా కొత్త స్ట్రెయిన్. అలా ఒక్క ఆ మహిళకే జరగలేదు.. చాలామందికి కరోనా సోకిన వాళ్లకు ఇటువంటి పరిస్థితే ఎదురవుతుండటంతో డాక్టర్లు కరోనా కొత్త రకం వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే… ఊపిరితిత్తుల పాడయితే శ్వాస అందదు. శ్వాస సమస్యలు వస్తే… వెంటనే ఆ వ్యక్తికి ఆక్సీజన్ అందించాల్సి ఉంటుంది. ఆక్సీజన్ సరైన సమయానికి దొరక్కపోతే.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. కరోనా బారిన పడకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని డాక్టర్లు సూచిస్తున్నారు.