Anchor Devi Nagavalli : యాంకర్ దేవీ నాగవల్లికి అదిరిపోయే కౌంటర్లు.. బాబు గోగినేని, రాహుల్ రామకృష్ణ సెటైర్లు.
Anchor Devi Nagavalli : విశ్వక్ సేన్ ఇటీవలే నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబెట్‌లో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లి మధ్య గొడవకు దారితీసింది. దీంతో గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ ఎఫ్ పదంతో దూషించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంలో దేవీ నాగవల్లి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముందుగా దేవీ నాగవల్లి గెట్ అవుట్ అన్న తరువాతే విశ్వక్ సేన్ ఎఫ్ అనే పదాన్ని ఉపయోగించాడని విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
నాగవళ్లిని ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తున్నారు.కాగా దీనిపై ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని స్పందించారు. దేవీ నాగవళ్లిని ఏకిపారేశాడు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లతో దేవి నాగవళ్లిపై విరుచుకుపడ్డారు. అతడు రోడ్లపై చేసంది తప్పైతే మరి నువ్ చేసిందేంటి అని నాగవళ్లి రోడ్లపై డ్యాన్స్ చేస్తున్న వీడియో జోడించి పోస్ట్ చేసి ప్రశ్నించాడు. టీవీ9లో ఇదివరకు చేసిన పిచ్చి ఫ్రాంక్ వీడియోలు, ప్రోగ్రమ్స్ వీడియోలు పెడుతూ దేవి నాగవళ్లి మాట్లాడిన మాటలు, ప్రవర్తిచిన తీరు చెబుతూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.అలాగే మరో వీడియో పోస్ట్ చేస్తూ దేవీ నాగవళ్లిని మానసిక వైద్యురాలిగా వర్ణించాడు. నీటిలో ఉన్ విద్యుత్ శక్తికి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఉన్న సంబంధాన్ని అవలీలగా వివరిసున్న జర్నలిస్ట్ దేవి గారు అంటూ సెటైర్లు వేస్తూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
అలాగే కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా ఈ ఇష్యూపై స్పందించాడు. టీవీ 9ను, దేవీ నాగవల్లికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్‌లో నేను కూడా పార్ట్ అవుదామని అనుకుంటున్నాను.. విశ్వక్ సేన్‌ను టీవీ 9 అవమానించిన విధానాన్ని ఖండిస్తున్నాను.. నేను అతడికి సపోర్ట్‌గా నిలుస్తున్నాను.. జర్నలిస్ట్‌లు అనే ముసుగులో వారేం చేస్తున్నారో నాకు తెలియడం లేదంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా యాంకర్ దేవీ నాగవళ్లి స్టూడియోలో ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. స్టూడియోకి పిలిచి అవమనించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ కి అండగా నిలబడుతున్నారు.