Corona Tablet : కరోనాను అంతం చేసే తొలి ట్యాబ్లెట్.. హైదరాబాద్ లోనే తయారీ.. ధర ఎంతో తెలుసా?
Corona Tablet : ప్రస్తుతం ప్రపంచమంతా మరోసారి కరోనా విలయంలో చిక్కుకుంది. కొత్త వేరియంట్లు ప్రజలను పీక్కు తింటున్నాయి. ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది. దీంతో పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో తొలిసారి కరోనా కోసం ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. నిజానికి.. కరోనా కోసం ప్రస్తుతం వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
తాజాగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడేందుకు యాంటీ వైరల్ డ్రగ్ మార్కెట్ లోకి వచ్చింది. దీన్ని తయారు చేసింది హైదరాబాద్ కు చెందిన అప్టిమస్ ఫార్మా కంపెనీ.అయితే.. ఈ మెడిసిన్ ను అందరికీ ఇవ్వడానికి వీలు లేదు. దాని పేరు మోల్నుపిరావిల్. 80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ కలిగిన వాళ్లకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ ను అందించాలి. అందుకే.. అందరికీ కాకుండా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ ట్యాబ్లెట్ ను వాడేందుకు అనుమతి లభించింది.
Corona Tablet : దీన్ని ఎవరికి మెడిసిన్ గా ఇవ్వాలి?
గత సంవత్సరం డిసెంబర్ 30నే ఈ ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. జనవరి 3, 2022 నుంచి ఈ ట్యాబ్లెట్ అన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. దీని ధర కూడా తక్కువే ఉండనుంది. మధ్యతరగతి, పేద ప్రజలు కూడా మెడిసిన్ ను కొనుక్కునేలా తక్కువ ధరకే ఈ ట్యాబ్లెట్ ను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.