Home » Exclusive » Covid Vaccine Registrations Begin Jan 1 For 15 To 18 Year Olds
Exclusive

Covid Vaccine : అలెర్ట్..15-18 ఏళ్ల వారికి జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు..!

Authored By
Inesh A
The Telugu News | Updated on: December 27, 2021 4:15 pm
Advertisement

Covid vaccine : దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఆ మేరకు వచ్చే జనవరి 3 వ తేదీ నుండి దేశంలో 15 నుండి 18 ఏళ్ల వయసు వారికి కోవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడి గత వారం మన్ కి బాత్ లో ప్రకటించారు. టీకా కోసం

Advertisement

జనవరి 1 నుండి కొవిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్‌, ఇతర ఐడీ కార్డులు లేని పిల్లలు విద్యాసంస్థలు జారీ చేసే స్టూడెంట్‌ ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని వెల్లడించింది. ఇక 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వృద్దులకు వైద్యుల సలహా మేరకు..

Covid vaccine registrations begin Jan. 1 for 15- to 18-year-olds

Advertisement

ముందు జాగ్రత్తగా ప్రికాషన్‌ డోసును అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఆరోగ్య విభాగ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు జనవరి 10 నుంచి టీకా డోసును వేయనున్నట్లు వెల్లడించింది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి