Cows Helped Police : పోలీసులకు నేరస్తుడిని పట్టించిన ఆవులు.. ఎలాగో తెలుసా?
Cows Helped Police : పోలీసులు ఏదైనా నేరం జరిగితే ఆ నేరాన్ని చేధించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతో కష్టపడతారు. వాళ్లను వీళ్లను ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఎలాగోలా కష్టపడి కేసును ఛేదించాల్సి వస్తుంది. పోలీసులు సాల్వ్ చేయలేని కేసులు ఎన్నో ఉంటాయి. అన్నింటినీ పరిష్కరించడం పోలీసుల వల్ల కాదు. కానీ.. ఒక కేసును మాత్రం ఆవులు పరిష్కరించాయి. అసలు నేరస్తుడు ఎవరో ఆవులే పోలీసులకు తెలిపాయి. ఇదివరకు కూడా ఒక చిలుక సాక్ష్యంతో అసలు నేరస్తుడు ఎవరో పోలీసులు ఎలా గుర్తుపట్టారో తెలుసు కదా. అలాంటిదే ఈ ఘటన కూడా.
ఈ ఘటన మన దగ్గర కాదు అమెరికాలో జరిగింది. యూఎస్ లోని నార్త్ కరోలినాకు చెందిన జోషువా మిల్ టన్ అనే వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఆ వ్యక్తి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. కానీ.. ట్రాఫిక్ సిగ్నల్స్ ను పట్టించుకోకుండా జోషువా అలాగే ముందుకు వెళ్తాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించకపోవడం యూఎస్ లో పెద్ద నేరం. పోలీసులు ఆ కారును చూసి వెంబడించారు. దీంతో వేగంగా కారును నడిపిన జోషువా ఒక చోట కారును ఆపి వెళ్లి పొలాల్లో దాక్కున్నాడు. కారును చూసి పోలీసులు తమ వాహనాన్ని ఆపి.. ఎక్కడ జోఘవా కారును ఆపాడో చూసి అక్కడ అతడి కోసం గాలిస్తారు.
Cows Helped Police : జోఘవా ఎక్కడ దాక్కున్నాడో పోలీసులకు చూపించిన ఆవులు
అతడి కోసం గాలిస్తుంటే కనిపించడు. అక్కడే గడ్డి మేస్తున్న ఆవులు అతడిని చూస్తాయి. వెంటనే అతడి దగ్గరికి వెళ్తాయి. ఆవును అతడి దగ్గరికి వెళ్లడం చూసిన పోలీసులు అతడిని చూసి వెంటనే అరెస్ట్ చేస్తారు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా చెప్పుకొచ్చారు. టౌన్ ఆఫ్ బూనె పోలీస్ డిపార్ట్ మెంట్ అనే ఫేస్ బుక్ ఖాతాలో ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు తాజాగా షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచభూతాలకు జంతువులు సాక్షిగా నిలుస్తాయి. అతడే నేరస్తుడు అని ఆవులు పసిగట్టి పోలీసులకు సాయం చేశాయి అని నెటిజన్లు ఆవులను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.