Subhman Gill : గిల్ మీద మండిపడుతున్న క్రికెట్ అభిమానులు.. జైశ్వాల్ సెంచరీ మిస్ చేశాడంటూ..?
ప్రధానాంశాలు:
Subhman Gill : గిల్ మీద మండిపడుతున్న క్రికెట్ అభిమానులు.. జైశ్వాల్ సెంచరీ మిస్ చేశాడంటూ..?
Subhman Gill : టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీం ఇండియా ప్రస్తుతం జింబాబ్వే తో ఐదు టీ 20ల సీరీస్ ఆడుతుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తి కాగా 3-1 తో సీరీస్ చేజిక్కించుకుంది టీం ఇండియా. ఐతే ఈ టూర్ కి మొత్తం యువ ఆటగాళ్లనే పంపించింది బిసిసిఐ. ఐపిఎల్ లో ప్రతిభ చూపించిన వారందరికీ ఛాన్స్ ఇచ్చింది. శుభ్ మాన్ గిల్ సార్ధన్యంలో జింబాబ్వే మీద యువ ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు. శనివారం జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచినా జింబాబ్వేకి బ్యాటింగ్ ఇచ్చాడు కెప్టెన్ గిల్. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది జింబాబ్వే. 154 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా ఓపెనర్లు గిల్, జైశ్వాల్ ల విధ్వంసకర బ్యాటింగ్ తో వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకున్నారు.
Subhman Gill : జైశ్వాల్ సెంచరీ మిస్
జైశ్వాల్ 93 పరుగులు, శుభ్ మాన్ గిల్ 58 పరుగులు చేశారు. జైశ్వాల్ 83 మీద ఉన్నాడు.. శుభ్ మాన్ గిల్ అప్పుడే హాఫ్ సెంచరీ చేశాడు. ఐతే ఇంకా పరుగులు 20 దాకా రావాల్సి ఉంది. ఆ టైం లో జైశ్వాల్ ని సెంచరీ చేయిస్తే బాగుండేది. కానీ శుభ్ మాన్ గిల్ హాఫ్ సెంచరీ అయ్యాక కూడా ఒక సిక్స్ కొట్టి పరుగులు తగ్గించాడు. ఇక చివరి రెండు బంతుల్లో జైశ్వాల్ సిక్స్, ఫోర్ కొట్టి 93 పరుగులు చేశాడు.
ఐతే జరిగిన మ్యాచ్ లో శుభ్ మాన్ గిల్ వల్లే జైశ్వాల్ సెంచరీ మిస్ అయ్యిందని క్రికెట్ అభిమానులు గిల్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. గిల్ ఒక స్వార్ధపూర్తమైన మనిషని.. జైశ్వాల్ సెంచరీ కాకుండా చేశాడని అంటున్నారు. ఐతే ఈ వార్తలపై జైశ్వాల్ కూడా స్పందించాడు. ఇద్దరం కలిసి వికెట్ పడకుండా గెలిపిద్దామనే అలా త్వరగా ముగించామని. గిల్ తనకు సపోర్ట్ ఇచ్చారని అన్నాడు.