వయసు మీద పడిన ప్రభుత్వ ఉద్యోగి .. రిటైరయ్యాడు.. ఇదేం పని.. దాని కోసం భార్యపై..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 3, 2023, 12:00 pm

భార్యాభర్తల మధ్య గొడవలు అనేక కారణాలవల్ల చోటు చేసుకున్న సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. అయితే వయసు మీద పడినా గాని ఓ వృద్ధుడు ఏకంగా భార్యని హత్య చేసేసాడు. అసలు విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి టిఎన్సి చీఫ్ గా పనిచేసే పదవి విరమణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటూ మద్యానికి బానిసై… వయసు మీద పడిన తన తోటి భార్యతో గొడవకు దిగటం ఆరంభించాడు.

రిటైర్ అయ్యాక ఈ రకంగా ప్రతిసారి భార్యని తాగి వచ్చి వేధిస్తూ ఉండేవాడు. గత నెల 30వ తారీకు సాయంత్రం ఐదు గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజ్ కుమార్… యధావిధిగా మళ్లీ భార్యతో గొడవకు దిగటం స్టార్ట్ చేశాడు. అయితే ఈసారి గుట్కా తినేందుకు భార్య డబ్బులు ఇవ్వటం లేదని.. ఆగ్రహానికి లోనయ్యి వెంటనే వంట గదిలో ఉన్న కూరగాయల కత్తితో భార్యా జాతిపై పొడిచాడు.

Crime News In Madhya Pradesh July 01

Crime News In Madhya Pradesh July 01

ఆమె కేకలు వేయడంతో వాటిని విన్నపరుగంటి వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం పోవడంతో మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ క్రమంలో కుమారుడు కమలేష్ మాంజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడైన రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp