Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

 Authored By sandeep | The Telugu News | Updated on :29 September 2025,8:00 am

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే కాదు, ఆయుర్వేద ప్రకారం ఔషధ గుణాలనూ కలిగి ఉంది. జీలకర్రలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే ఔషధ మొక్కగా దీన్ని వర్ణిస్తారు.

జీలకర్రను ఏ నియమం లేకుండా తీసుకుంటే కొన్ని దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. వాటిలో కొన్ని తీవ్రమైనవే కావడం విశేషం.

#image_title

జీలకర్ర తీసుకోవడంలో జాగ్రత్తలు ఎందుకు అవసరం?

పలు ఆరోగ్య ప్రయోజనాల్ని ఇచ్చే జీలకర్ర, కొన్ని సందర్భాల్లో హానికరంగా మారవచ్చు. ఇది ముఖ్యంగా అలెర్జీలు, రక్తంలో చక్కెర స్థాయిల తగ్గుదల, హార్మోన్ల అసమతుల్యత, గర్భస్రావం ప్రమాదం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

జీలకర్ర వలన కలగవచ్చే నష్టాలు:

1.అలెర్జీ సమస్యలు:

కొంతమందికి జీలకర్ర తినడంతో చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి వారు జీలకర్రను పూర్తిగా నివారించాలి.

2.రక్తంలో చక్కెర స్థాయి అధికంగా తగ్గుతుంది:

జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇది హైపోగ్లైసీమియా ఉన్న వారికి ప్రమాదకరం. డయాబెటిస్ మందులు వాడే వారు జాగ్రత్తగా ఉండాలి.

3.గర్భిణీ స్త్రీలకు ప్రమాదం:

జీలకర్ర అధికంగా తీసుకోవడం వల్ల గర్భాశయం ఉద్దీపన చెంది, గర్భస్రావానికి దారితీయవచ్చు. గర్భిణీ స్త్రీలు జీలకర్రను పరిమితంగా తీసుకోవడం మంచిది.

4. హార్మోన్ల అసమతుల్యత:

జీలకర్రను ఎక్కువగా తినడం వల్ల హార్మోన్ల స్తాయిల్లో మార్పులు రావచ్చు. ఇది మహిళల ఋతు చక్రంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది