Daggubati Purandeswari : ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. పురందేశ్వరి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daggubati Purandeswari : ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. పురందేశ్వరి..!

 Authored By mallesh | The Telugu News | Updated on :20 November 2021,6:10 pm

Daggubati Purandeswari : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తన భార్య పట్ల వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారని, తనకు నిండు సభలో కలిగిన అవమానానికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం కూడా చేశాడు. ఈ క్రమంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఎన్టీఆర్ కూతురు, బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించారు.

Daggubati Purandeswari : ఆ వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయన్న పురందేశ్వరి..

daggabuati purandeshwari counter on Ysrcp

daggabuati purandeshwari counter on Ysrcp

తాము సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లుగా ఎంతో విలువలతో పెరిగామని తెలిపారు. వైసీపీ నేతల మాటల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు. భువనేశ్వరిపైన చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయని, భువనేశ్వరి క్యారెక్టర్‌ను కించపరచడం దారుణమైన చర్యని చెప్పారు పురందేశ్వరి. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనకు నిరసనగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉన్నప్పటికీ అప్పుడే పొలిటికల్ అట్మాస్పియర్ బాగా హీటెక్కింది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ అప్పుడే యుద్ధం ప్రకటించేసింది.

మరో వైపున బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికార వైసీపీపై పోరుకు సిద్ధమవుతున్నది. ఇక రాజకీయ క్షేత్రంలో టీడీపీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించే చాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తంగా టీడీపీ రాజకీయ క్షేత్రంలో ఇక యుద్ధం మాదిరిగా వైసీపీతో తలపడనున్నది. మరో వైపున బీజేపీ-జనసేన కూడా సంయుక్త కార్యచరణతో ముందుకు సాగే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే, గతంలో మాదిరిగా మళ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అయితే కనుక కచ్చితంగా అధికార వైసీపీని ఎన్నికల్లో ఓడించగలుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది