Daggubati Purandeswari : పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చేసిన త్యాగానికి దండం పెట్టాలి.. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..!
ప్రధానాంశాలు:
Daggubati Purandeswari : పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చేసిన త్యాగానికి దండం పెట్టాలి .. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..!
Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేశాయి. పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం సంతోషం అన్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీరాముడికి ఆంజనేయుడు, విభీషణుడు, జాంబవంతుడు, ఉడత సాయం ఎలా అవసరమైందో ఏపీలో అరాచక పాలన అంతం చేయడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని స్పష్టం చేశారు.
మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని పురందేశ్వరి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు అంశంపై అభిప్రాయ సేకరణకు రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని వారంతా పొత్తులను అర్థం చేసుకుంటారని పురందేశ్వరి అన్నారు. అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే 8 నియోజకవర్గాలు బీజేపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఉండవచ్చు అని తెలుస్తుంది. జనసేన బీజేపీ కి 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మిగిలిన 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ జనసేనకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తుంది.
8 సీట్లలో బీజేపీ ఆరు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఆరు చోట్ల బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ లోక్ సభ సీట్లపై మాత్రమే దృష్టి సారించిందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ పొత్తు లో పూర్తిస్థాయిలో అసెంబ్లీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ రాలేదు. లోకసభ స్థానం అయితే కాకినాడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. వీటిపై మారింత స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఆలస్యమైనట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ అసెంబ్లీ స్థానాల కంటే లోక్ సభ స్థానాలపై ఎక్కువ దృష్టి సారించినట్లుగా ఉంది. 6 లోక్ సభ స్థానాలను బీజేపీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీకి 30 సీట్లను ప్రకటించింది అందులో 24 సీట్లు జనసేన మిగిలినవి బీజేపీకి ఖరారైనవి.