Sagar by poll : సాగర్ లో టీఆర్ఎస్ మిడతల దండు దిగింది… కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు?
Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఒక చర్చ చాలా తీవ్రస్థాయిలో జరుగుతోంది. అదే నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించి. సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై చాలా సందిగ్దత నెలకొన్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే దుబ్బాకకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట చనిపోవడంతో…. ఉపఎన్నిక నిర్వహించగా… బీజేపీ గెలిచి తమ సత్తా చాటింది. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో ఓడిపోవడంతో హైకమాండ్ కూడా వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దుబ్బాకలో ఓడిపోవడంతో…. కనీసం నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అయినా ఖచ్చితంగా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది.

dasoju shravan on trs ahead of nagarjuna sagar elections
అందుకే… టీఆర్ఎస్ పార్టీ సాగర్ లో దూకుడు పెంచింది. ఈసారి ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి… సాగర్ ఉపఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాగర్ లోనే మకాం వేశారు. ఈసారి సాగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు.. కాంగ్రెస్ పార్టీ. అందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి సాగర్ లో మంచి పలుకుబడి ఉంది. అందుకే…. జానారెడ్డిని దాటుకొని సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా వ్యూహాలు కాస్త గట్టిగానే ఉండాలి. అందుకే… సీఎం కేసీఆర్ కూడా సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే… టీఆర్ఎస్ పార్టీ సాగర్ లో గెలవడం కోసం ఎన్నో అక్రమాలకు తెర లేపుతోందని ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలయితే ఎన్నికల ప్రచారంలో, ప్రెస్ మీట్లు పెట్టి మరీ… టీఆర్ఎస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్… టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

dasoju shravan on trs ahead of nagarjuna sagar elections
Sagar by poll : మీరెన్ని కుట్రలు చేసినా జానారెడ్డి గెలుపు ఖాయం
నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు ఓటమి భయం అప్పుడే ప్రారంభం అయిందని దాసోజు శ్రవణ్ అన్నారు. అందుకే… టీఆర్ఎస్ మిడతల దండు సాగర్ లో దిగిందని విమర్శించారు. నాగార్జున సాగర్ లో చివరకు కేసీఆర్ టీఎన్జీవోలను కూడా రంగంలోకి దింపాలని దాసోజు మండిపడ్డారు. వాళ్లు ఉద్యోగులు కాదు. టీఆర్ఎస్ మిడతల దండు. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి.. ఏం చేసినా… జానారెడ్డిదే గెలుపు. టీఎన్జీవోలు తమ ఇష్టం ఉన్నట్టు సాగర్ లో వ్యవహరిస్తున్నారు. విజయ విహార్ గెస్ట్ హౌస్ లో టీఎన్జీవోలు ఎలా మీటింగ్ పెడతారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశాం… అంటూ దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు.