హేట్సాఫ్.. నువ్వు నిజమైన పోలీస్ అంటే.. కూతురు పెళ్లి పెట్టుకొని ఈ పోలీస్ ఏం చేశాడో చూడండి..!
ప్రస్తుతం దేశమంతా ఎదుర్కొంటున్న సమస్య కరోనా. కరోనా వల్ల జీవితాలే అతలాకుతలం అవుతున్నాయి. కరోనా భయంతో జనాలు ఇంట్లో నుంచి బయటికే రావడం లేదు. అసలు.. ఈ కరోనా వల్ల.. సొంత వాళ్లు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏనాడు కూడా మనం ఇలా జరుగుతుందని ఊహించి ఉండం. కరోనా మహమ్మరి.. మొత్తం జీవితాలనే అతలాకుతలం చేసేసింది. చివరకు మనుషులు పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. చివరకు కరోనాతో మృతి చెందితే కరోనా సోకి చనిపోయిన వారిని చూడటానికి కూడా దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు.

delhi police postpones his daughter marriage for last rites
ఇక.. స్మశానాల వద్ద అయితే క్యూ కడుతున్నారు. వందల కొద్దీ మృతదేహాలను స్మశానాలకు తరలుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. కనీసం కరోనాతో చనిపోయిన వాళ్ల అంత్యక్రియలను దగ్గరుండి జరిపించలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. ఈనేపథ్యంలో ఢిల్లీలో ఓ స్మశాన వాటిక వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్.. అక్కడికి వచ్చే కరోనా మృతదేహాలకు తానే దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో శవాలు స్మశాన వాటికకు తరలివస్తుండటంతో.. వాటికి అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టంగా మారుతోందట. దీంతో.. తానే దగ్గరుండి రోజూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం కూతురు పెళ్లినే వాయిదా వేశాడు
కరోనా మృతుల అంత్యక్రియలు అక్కడ సమస్యగా మారడంతో వాళ్ల అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఏకంగా తన కూతురు పెళ్లినే వాయిదా వేసుకున్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఈ సమయంలో అయినా మనం మానవత్వంతో ఉండకపోతే ఎలా? కనీసం వాళ్ల మృతదేహాలకు అయినా సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించాలని.. అందుకే.. నాకు తోచింది నేను చేస్తున్నా. ఈసమయంలో నేను నా కూతురు పెళ్లి చేయడం కన్నా.. ఇక్కడ కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడమే నాకు ముఖ్యం అనిపించింది. నేను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా. బాగానే ఉన్నా. నేను కూడా నాకు తోచిన సాయం చేస్తేనే కదా.. రేపు నాకు కూడా ఎవరైనా సాయం చేస్తారు.. అంటూ చెప్పుకొచ్చాడు ఆ పోలీస్.