Kaju Paneer Masala : దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా… ఒక్కసారి తిన్నారంటే దీనిని ఎప్పటికీ మర్చిపోరు…
Kaju Paneer Masala : కాజు పన్నీర్ మసాలా అంటే దాబాలలో చపాతి, రోటి, పుల్కాలలో సైడ్ డిష్ గా ఇస్తూ ఉంటారు.. వాటితో తింటే ఒక్కసారి తింటే అసలు మర్చిపోలేము… అటువంటి కాజు, పన్నీర్ మసాలా కర్రీ దాబా స్టైల్ లో మనం ఇప్పుడు ఇంట్లోనే ఎంతో సింపుల్ గా తయారు చేద్దాం… కావాల్సిన పదార్థాలు : జీడిపప్పు ,పన్నీర్ ముక్కలు, జిలకర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం […]
Kaju Paneer Masala : కాజు పన్నీర్ మసాలా అంటే దాబాలలో చపాతి, రోటి, పుల్కాలలో సైడ్ డిష్ గా ఇస్తూ ఉంటారు.. వాటితో తింటే ఒక్కసారి తింటే అసలు మర్చిపోలేము… అటువంటి కాజు, పన్నీర్ మసాలా కర్రీ దాబా స్టైల్ లో మనం ఇప్పుడు ఇంట్లోనే ఎంతో సింపుల్ గా తయారు చేద్దాం…
కావాల్సిన పదార్థాలు : జీడిపప్పు ,పన్నీర్ ముక్కలు, జిలకర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, కొత్తిమీర, నూనె మొదలైనవి… తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక కాడయి పెట్టుకొని, దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఒక కప్పు జీడిపప్పును వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత దానిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరంమసాలా, ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం, వేసి వేయించుకోవాలి.
తర్వాత దానిలో ఒక రెండు టమాటాల పేస్ట్, అలాగే ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి బాగా నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఒక రెండు చెంచాల పెరుగు, కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసి ఒక పది నిమిషాలు కదపకుండా అలాగే ఉడకనివ్వాలి. ఒక పది నిమిషాల వరకు ఉడికిన తర్వాత దానిని కలుపుతూ కొద్దిగా నెయ్యి వేసి కూరలో నుంచి నూనె పైకి తేలిన తర్వాత దానిని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ఇంట్లోనే దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాల రెడీ.