Dhanteras 2025 | ధంతేరాస్ రోజు ఏ వస్తువులను కొనకూడదు ..పండితుల సూచనలు
Dhanteras 2025 | ధంతేరాస్ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు వంటి శుభప్రదమైన వస్తువులను కొనడం మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు సూచిస్తారు. అయితే, ఈ పర్వదినాన కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం అశుభకరమని కూడా నమ్ముతారు.
#image_title
1. ఇనుము, ఉక్కు, అల్యూమినియం
ధంతేరాస్ రోజున ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు కొనడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇనుమును శని గ్రహంతో ముడిపెడతారు కాబట్టి, ఈ రోజున ఇనుము సంబంధిత వస్తువులు తీసుకురావడం దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
2. పదునైన వస్తువులు
కత్తులు, కత్తెరలు, బ్లేడ్‌లు, కట్టర్లు వంటి పదునైన వస్తువులను ధంతేరాస్ రోజున కొనడం అసహ్యం. ఇవి రాహు లేదా అరిష్ట శక్తులతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తిని పిలిచివస్తాయని నమ్ముతారు.అదేవిధంగా గాజు సామాను, ప్లాస్టిక్ వస్తువులు కూడా కొనకూడదు. గాజును కూడా రాహు ప్రభావంతో చూడటంతో, ఇంట్లో సుఖశాంతులు తగ్గుతాయని పండితులు సూచిస్తున్నారు.
3. నలుపు రంగు వస్తువులు
ఈ శుభ దినాన నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు కొనడం లేదా ధరించడం వలన చీకటి, దురదృష్టం దారితీస్తుందని నమ్ముతారు. అలాగే ఖాళీ పాత్రలు కూడా తీసుకురాకూడదని చెబుతున్నారు. ఖాళీ పాత్రలు సంపద లేకపోవడాన్ని సూచిస్తాయి, అందుకే వాటిని ధాన్యాలు, బియ్యం లేదా నీటితో నింపి ఇంటికి తీసుకురావడం శుభకరమని పండితులు అంటున్నారు.
ఇంకా, ధంతేరాస్ రోజున నూనె, నెయ్యిను బయటకు దానం చేయడం లేదా అమ్మడం కూడా మంచిదని పండితులు భావించరు.