Karthika Deepam 2 Today Episode 26 Feb 2026 : జ్యోత్స్నకి దాస్ వార్నింగ్.. పారుతో కార్తీక్ మైండ్ గేమ్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 February 2026,8:30 am

Karthika Deepam 2 Today Episode 26 Feb 2026 స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో సరికొత్త మలుపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 26వ తేదీ (నేటి) ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు, భావోద్వేగాలు, పాత్రల మధ్య మైండ్ గేమ్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో వివరంగా చూద్దాం.

Karthika Deepam 2 Today Episode 26 Feb 2026 : జ్యోత్స్నకి దాస్ వార్నింగ్.. పారుతో కార్తీక్ మైండ్ గేమ్!

Karthika Deepam 2 Today Episode 26 Feb 2026 : జ్యోత్స్నకి దాస్ వార్నింగ్.. పారుతో కార్తీక్ మైండ్ గేమ్!

Karthika Deepam 2 Today Episode 26 Feb 2026 కాశీపై నిప్పులు చెరిగిన స్వప్న

ఎపిసోడ్ ప్రారంభంలోనే స్వప్న, కాశీల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. తనను క్షమించి, జీవితంలో మరో అవకాశం ఇవ్వాలని కాశీ స్వప్నను బతిమాలుతాడు. దశరథ, సుమిత్ర, కార్తీక్, దీపల ఉదాహరణలు చెబుతూ మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. అయితే, స్వప్న మాత్రం ససేమిరా అంటుంది. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందని, చావు బతుకుల్లో ఉన్న పామును రక్షించినా అది కాటు వేయక మానదని కాశీకి చురకలు అంటిస్తుంది. ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని కాశీ అడిగితే.. మళ్లీ తనను ఫుడ్ పాయిజన్ కేసులో ఇరికిస్తావేమో అంటూ స్వప్న ఫైర్ అవుతుంది. ఈ జన్మలో నిన్ను క్షమించేది లేదని తేల్చి చెబుతుంది.

Karthika Deepam 2 Today Episode 26 Feb 2026 జ్యోత్స్న, దాసుల మధ్య హై డ్రామా

మరోవైపు దాసును రహస్యంగా కలుస్తుంది జ్యోత్స్న. దీప ఎవరు అనే నిజాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పేశావా అని తండ్రిని నిలదీస్తుంది. దశరథ వ్యవహారశైలి పూర్తిగా మారిపోవడంతో, తాను నిజంగా దశరథ కూతురినా? లేక నీ కూతురినా? అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నువ్వే దశరథ కూతురివి అని దాసు బుకాయించే ప్రయత్నం చేస్తాడు. కానీ, జ్యోత్స్న ఆ మాటలను నమ్మదు.

ఇదే సమయంలో దాసు జ్యోత్స్నకు ఊహించని షాక్ ఇస్తాడు. “ఆస్తి కోసం మీరు ఇప్పటికే చాలా పాపాలు చేశారు.. దశరథ అన్నయ్యను దీప షూట్ చేసిందని చెప్పారు కదా, బహుశా అది కూడా నీ పనే అని నాకు డౌట్ గా ఉంది” అని దాసు అనడంతో జ్యోత్స్న బిత్తరపోతుంది. నిజాన్ని తానే స్వయంగా కనిపెడతానని జ్యోత్స్న సవాల్ చేస్తుంది.

దీపకు భరోసా.. కార్తీక్ గుండెల్లో భయం

కుబేర ఫోటో ముందు దీప ఏడుస్తుండగా కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇంట్లో వాళ్లందరికీ దీపపై అనుమానాలు మొదలయ్యాయని, ముఖ్యంగా శివన్నారాయణ, దశరథలకు నిజం తెలిసిపోతుందేమోనని కార్తీక్ ఆందోళన వ్యక్తం చేస్తాడు. తన వల్ల కార్తీక్ కు ఇన్ని కష్టాలు వస్తున్నాయని దీప బాధపడుతుంది. అయితే, దీపను ఎలాగైనా ఆ ఇంటి అసలైన వారసురాలి స్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని కార్తీక్ స్పష్టం చేస్తాడు. కానీ, ఆపరేషన్ సమయంలో జ్యోత్స్న, పారిజాతం ఎలాంటి కుట్రలు చేస్తారోనని, కడుపులోని బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని కార్తీక్ తీవ్రంగా మదనపడతాడు.

పారిజాతానికి దాస్ వార్నింగ్

నువ్వు పదే పదే నన్ను కలవడం చూస్తే శివన్నారాయణ గారికి అనుమానం వస్తుందని పారిజాతాన్ని దాసు హెచ్చరిస్తాడు. ఒకవేళ బిడ్డలను మార్చిన విషయం ఆయనకు తెలిస్తే.. తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ తో నిన్ను కాల్చేస్తాడని దాసు వార్నింగ్ ఇవ్వడంతో పారిజాతం వణికిపోతుంది. అయినా సరే, అసలైన మనవరాలిని నేనే.. ఏది ఏమైనా నిజం తెలుసుకుంటానని జ్యోత్స్న గట్టిగా చెబుతుంది.

పారుతో కార్తీక్ మైండ్ గేమ్.. శివన్నారాయణకు షాక్

ఉదయాన్నే పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ కలిసి మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మనశ్శాంతి కోసమే ఇదంతా అని వారు అనుకుంటుండగా.. అక్కడికి కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కావాలనే శివన్నారాయణను అక్కడికి రప్పించి పెద్ద బాంబు పేలుస్తాడు. “ఏంటి పారు ఇంత పొద్దున్నే టెన్షన్ పడుతున్నావ్? దాసు మావయ్యను ఎవరైనా కిడ్నాప్ చేశారనే భయమా?” అని కార్తీక్ అడగడంతో పారిజాతం, జ్యోత్స్నల ముఖాల్లో రంగులు మారుతాయి. దాసు కిడ్నాప్ ఏంట్రా అని శివన్నారాయణ షాక్ అవ్వడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి