Kethireddy : స్పాట్ లో వార్డు వాలంటీర్ల జాబ్స్ పీకేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి… ఆయన మగాడ్రా బుజ్జి.!
Kethireddy : ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు కేతిరెడ్డి బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి రోజు ఉదయం తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకుంటారు. ఆయన వెంట అధికారులు కూడా ఉంటారు. వెంటనే ప్రజల సమస్యలను అక్కడికక్కడే తీర్చేస్తుంటారు. ఇదంతా చెబుతుంటే అచ్చం ఏదో సినిమాలో చూసినట్టే ఉంది కదా.

dharmavaram ycp mla kethireddy venkatramireddy orders to fire ward volunteers
అవును… అదేదో సినిమాలో అంటారు కదా… వాడు మగాడ్రా బుజ్జి అని… అది కేతిరెడ్డికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఆయన నిజంగా మగాడు. ఎందుకంటే… ఈరోజుల్లో గెలిచాక… మళ్లీ ఐదేళ్ల వరకు కనీసం తమను గెలిపించిన ప్రజల ముఖం కూడా చూడరు కొందరు నాయకులు. వాళ్ల సమస్యలను కూడా పట్టించుకోరు. కానీ… ఏపీలో వైసీపీ నేతలు అలా కాదు. వైసీపీ ఎమ్మెల్యేలు అలా కాదు. మేం ప్రజల ప్రతినిధులం అని గుర్తు చేస్తున్నారు.
వాళ్లలో ఒకరే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సమస్యను అక్కడికక్కడే తీర్చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. తన నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా… వెంటనే అధికారులకు, ప్రజలకు సమస్య కలిగించిన వాళ్లకు ప్రజల ముందే ఫోన్ చేసి వాళ్లను ఎడాపెడా వాయించేస్తారు.
Kethireddy : మీటింగ్ కు హాజరు కాలేదని వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించారు
కేతిరెడ్డి కొన్ని విషయాల్లో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటారు. ఒక వార్డుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆ వార్డుకు సంబంధించిన వార్డు వాలంటీర్లు అక్కడ ఉండాలి. మీటింగ్ జరుగుతున్నా… కొందరు వార్డు వాలంటీర్లు అక్కడికి రాకపోవడంతో వెంటనే మీటింగ్ కు హాజరుకాని వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను తీసేయాలంటూ అధికారులను ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశించారు.
వైసీపీ పార్టీలో ఇలాంటి ఒక ఎమ్మెల్యే ఉండటం అది వైసీపీ పార్టీకే గర్వకారణం. ఇలాగే అందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని.. అక్కడికక్కడే పరిష్కారం చూపగలిగితే ఏపీ అలా చూస్తుంటేనే డెవలప్ కాదా? వైసీపీ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు అంటే దానికి కారణం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్లు ఉండటమే.