Pawan Kalyan | పవన్ కాళ్లపై పడ్డ డిస్ట్రిబ్యూటర్.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్, యాక్షన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇక ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ భారీగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు పవన్.
#image_title
క్రేజీ మూమెంట్
తాజాగా ఓజీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో అదరగొట్టారు. అలాగే ఈ ఈవెంట్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు పవన్ కళ్యాణ్. డిస్ట్రిబ్యూటర్స్ కు మెమెంటోలు అందజేశారు. ఈ క్రమంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ కాళ్లకు ఉన్న చెప్పులు తీసేసి.. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డాడు.
వెంటనే పవన్ కళ్యాణ్ ఆయనను ఆపేసి.. వొద్దు అని ఆపేసి.. వెళ్లి చెప్పులేసుకొని రమ్మన్నారు. ఆయన వెళ్లి చెప్పులేసుకు వచ్చిన తర్వాత పవన్ మెమెంటో అందజేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అందరి అభిమానులకు ఒక విజ్ఞప్తి ఫ్యాన్ వార్ ని ఆపేయండి. మంచి సినిమాలని చంపకండి అందరి హీరోల సినిమాల్ని ఆదరించండి. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి అని పవన్ పిలుపునిచ్చారు.