ఎన్టీఆర్ కు వర్మ సలహా అక్కర్లేదు.. దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్
ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ సారి నారా లోకేష్ ను టార్గెట్ చేసుకొని చేసిన హాట్ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని లేపాయి. “తెలుగుదేశం పార్టీ అనే శరీరం నారా లోకేష్ వైరస్ అనే ఒక ప్రమాదకరమైన సూక్ష్మజీవి బారిన ఘోరాతి ఘోరంగా పడిపోయిందని, ఆ జబ్బు తగ్గాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒన్ అండ్ ఓన్లీ వ్యాక్సిన్ తారక్” అని వర్మ చేసిన ట్విట్ టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇటు సినీ పరిశ్రమలో కూడా వర్మ వ్యాఖ్యలపై చర్చలు నడుస్తున్నాయి.
తాజాగా దీనిపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి గొడవలు పెట్టనిదే రాంగోపాల్ వర్మకు తాగిన మత్తు దిగదని.. తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వర్మ పెట్టిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. తెదేపా కోసం సేవ చేయటానికి సిద్ధమని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌కు తెలుసనని.. వర్మ సలహా ఆయనకు అక్కర్లేదన్నారు.
లోకేశ్ సత్తా ఏంటో, గత ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డులు వచ్చాయో చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. తాను, వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగా 420 పనులేవీ చేయట్లేదని వ్యాఖ్యానించారు. వర్మకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే తాగి వాగితే తెదేపా సైనికులు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదని హెచ్చరించారు. ఇక సాధారణంగానే అందరిని టార్గెట్ చేసే వర్మను ఇప్పుడు దివ్యవాణి టార్గెట్ చేసింది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ఏది ఏమైనపప్పటికీ టీడీపీ వర్గాల్లో మరోసారి ఎన్టీఆర్ ప్రస్తావన చర్చకు రావటం బాబు వర్గానికి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.