Google Privacy : గూగుల్‌లో మీ ఇన్ఫర్మేషన్ సేఫ్‌గానే ఉందా..? ఇలా చేస్తే బెటర్..
Google : పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే సమయం వరకు దాదాపుగా అందరూ ఒక్కసారైనా గూగుల్‌ను ఓపెన్ చేయని వారంటూ ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ చిన్న డౌట్ వచ్చినా.. గూగుల్‌లో సర్చ్ చేస్తుంటారు. ఇలాంటి రోజులో ఎన్నో ఉంటాయి. మెయిల్, మ్యాప్స్, ఫొటోలు, కాంటాక్ట్స్, షాపింగ్ ఇలా ఏ విషయానికైనా గుగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఈ సేవలు పొందేందుకు కచ్చితంగా మన వ్యక్తిగత సమాచారాన్ని కచ్చితంగా గూగుల్‌కు ఇవ్వాలి. మనం గూగుల్ కు ఇచ్చిన సమాచారం ఇతరులకు సైతం కనిపించే చాన్స్ ఉంటుంది. దీంతో డేటా ప్రైవసీకి ఇబ్బంది కలిగే చాన్స్ ఉంది.
కొన్ని నార్మల్ సెట్టింగ్స్ చేయడం వల్ల మీ డేటాను భద్రపరుచుకోవచ్చు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం.ముందుగా గూగుల్ బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. దాని తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. వెంటనే మీ గూగుల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక అందులో మీకు సంబంధించిన పర్సనల్ ఇన్‌ఫో సెక్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ వాట్ అథర్స్ సీ అని కనిపిస్తుంది.
Google Privacy : ఇలా చేస్తే సరి..
దానిని సెలక్ట్ చేయాలి. అనంతరం అబౌట్ మీపై క్లిక్ చేయాలి. తర్వాత యాడ్, రిమూవ్, ఎడిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దీని ఆధారంగా మీ అకౌంట్ వివరాలను సెట్ చేసుకోవచ్చు. ఇక మీ ఇన్ఫర్మేషన్ ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఓన్లీ మీ అనే దానిని ఎంచుకోవాలి.. ఇలా చేస్తే మీ ఇన్ఫర్మషన్ ఎవరికీ కనిపించదు. దీని వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు సంబంధించిన సమాచారం ఎవరికీ కనిపించదు. కేవలం మీకు మాత్రమే కనిపిస్తుంది. మరి సెట్టింగ్స్ ను ఇలా మార్చుకోండి.