Google | ఏపీకి గూగుల్ వ‌చ్చేస్తుంది.. క‌న్‌ఫాం చేసిన నారా లోకేష్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Google | ఏపీకి గూగుల్ వ‌చ్చేస్తుంది.. క‌న్‌ఫాం చేసిన నారా లోకేష్‌

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2025,2:00 pm

Google | గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ Alphabet విశాఖలో 1గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 6బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే షుమారు 50వేలకోట్లకు పైగా దీనిపై గూగుల్ వెచ్చించనుందని తెలుస్తుంది. ఎప్పటి నుంచో గూగుల్ విశాఖకు వస్తోందనే ప్రచారం జరుగుతోంది కానీ.. అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఆ సంస్థ కానీ అధికారికంగా ప్రకటించలేదు.

#image_title

బిగ్గెస్ట్ డేటా సెంటర్..

ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ఇంతకు మందు మాట్లాడినప్పుడు.. ఈ విషయం ఖరారయ్యాక మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా విశాఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. వైజాగ్‌లో జరిగిన ఓ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడిన ఆయన.. “గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కు రాబోతోంది” అని చెప్పారు. తానే స్వయంగా వారికి స్థలం కూడా చూపానన్నారు. ఇది కార్యరూపం దాల్చితే. ఇండియాలో గూగుల్ ఒకేసారి పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే అవుతుంది.

విశాఖకు రాబోయే డేటా సెంటర్ ఇండియాకే ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఎందుకంటే వైజాగ్‌లో నిర్మించేది గూగుల్ ఏషియాలో నిర్మాణం చేస్తున్న అతిపెద్ద సెంటర్. 1 గిగావాట్ సామర్థ్యంతో… 6బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్..వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుక గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. వైజాగ్ డేటా సెంటర్‌లో 2బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధనం (Renewable energy) ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకే వినియోగించనుంది.మన ఇంటర్నెట్ నిరంతరాయంగా పనిచేయాలంటే డేటా సెంటర్లు కీలకం. అది లేకపోతే సేవలన్నీ నిలిచిపోతాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది