Google Pixel 10 | గుడ్ న్యూస్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్ చేసే అవకాశం.. అదిరిపోయే ఫీచర్
Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel 10) చేసుకోవచ్చు. మీ దగ్గర గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌లకు ఈ కొత్త శాటిలైట్ ఫీచర్ గూగుల్ తీసుకువస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీతో SOS అలర్ట్స్, ప్రైమరీ లొకేషన్ షేరింగ్ మాత్రమే వీలుంది.

#image_title
శాటిలైట్‌తోనే..
కానీ, గూగుల్ అందించే ఈ కొత్త శాటిలైట్ ఫీచర్ మొబైల్ సిగ్నల్, వై-ఫై ఇంటర్నెట్ సర్వీసు లేకున్నా కూడా ఈజీగా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. ఆగస్టు 28 నుంచి ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సపోర్టు చేసే ప్రాంతాల్లోని పిక్సెల్ 10 యూజర్లు శాటిలైట్ లింక్ ఉపయోగించి వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ చేయొచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో Wi-Fi లేదా మొబైల్ కనెక్షన్ లేని ప్రాంతంలో చిక్కుకుపోయినా మీ దగ్గర పిక్సెల్ 10 ఫోన్ ఉంటే చాలు.. మీరు ఎక్కడ ఉన్నారో ఈజీగా వాట్సాప్ ద్వారా తెలియజేయొచ్చు. ఈ శాటిలైట్ ఫీచర్‌కు సంబంధించి గూగుల్ ఒక వీడియో డెమోను పోస్టు చేసింది. పిక్సెల్ 10లో వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు స్టేటస్ బార్‌లో చిన్నపాటి శాటిలైట్ ఐకాన్ మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా రోజువారీ చాటింగ్ కోసం కూడా రియల్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాల్స్ రెండింటినీ అందిస్తుంది. ఇప్పటివరకూ ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఈ తరహా శాటిలైట్ సర్వీసును అందించలేదు. ముందుగా అమెరికాలో ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో భారత్ సహా ఇతర దేశాల్లో వచ్చే అవకాశం ఉంది.