Free Flight Tickets : ఫ్రీగా విమానం ఎక్కాలి అంటే ఇలా చేయండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Free Flight Tickets : ఫ్రీగా విమానం ఎక్కాలి అంటే ఇలా చేయండి !

 Authored By prabhas | The Telugu News | Updated on :23 May 2023,10:00 am

Free Flight Tickets : ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం తీర్థయాత్రలకు వెళ్ళే సీనియర్ సిటిజన్స్ కు ఉచిత విమాన ప్రయాణం అందిస్తామంటు ప్రకటించింది. ఇలాంటి ఆఫర్ ఇచ్చిన మొదటి రాష్ట్రం తమదేనా అని ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన ప్రోగ్రాంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ ను తీర్థ యాత్రలకు ఫ్రీగా తీసుకెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 32 మంది సీనియర్ సిటిజన్లను మే 21 న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు ఉచితంగా తీసుకువెళ్లిది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లోని రాజా భోజ్ విమానాశ్రయం నుంచి పచ్చ జెండా ఊపారు.

Do this to get a Free Flight Tickets

Do this to get a Free Flight Tickets

విమాన ప్రయాణం ద్వారా సీనియర్ సిటిజన్ లను తీర్థయాత్రలకు పంపించే కల సాకారం అయిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.మే, జూలై మధ్యకాలంలో సీనియర్ సిటిజన్ల బ్యాచ్లను విమానాల్లో ఫ్రీగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారమే మే 23న అగర్ మాల్వా జిల్లాకు చెందిన యాత్రికుల బృందం ఇండోర్ నుంచి విమానంలో మహారాష్ట్రలోని షిరిడీకి బయలుదేరుతారు. అలాగే రెండు రోజుల తరువాత బేతుల్ జిల్లా నుంచి యాత్రికులు భోపాల్ నుంచి బయలుదేరే విమానంలో మధుర-బృందావన్ సందర్శన కోసం ఆగ్రాకు వెళతారు. మే 26న ఇండోర్ నుంచి షిర్డీకి మరో విమానం దేవాస్ జిల్లా నుండి యాత్రికులను తీసుకువెళుతుంది.

Flight Journey: ధమాకా ఆఫర్.. బస్‌ టికెట్‌ ధరకే విమాన ప్రయాణం! - Low-cost airline Go First announces a two-day fare sale as the battle for Indian skies intensifies ahead of the summer travel season

జూన్ 3న కాన్వాడ్ జిల్లాకి చెందిన సీనియర్ సిటిజన్ లు గంగాసాగర్ సందర్శన కోసం ఇండోర్ నుంచి కోల్కతాకు వెళ్లే విమానంలో ఎక్కుతారు. బిజెపి ప్రభుత్వం 2012 లో లాంచ్ చేసిన తీర్థ దర్శన యోజన ప్రోగ్రాం తీర్థయాత్రలలో సీనియర్ సిటిజన్లకు ఉచిత విమాన ప్రయాణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఈ పథకానికి తీర్థయాత్ర ప్రయాణాలకు ప్రత్యేక రైళ్లను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసింది. దాదాపుగా ఈ పథకం ద్వారా 7.82 లక్షల మంది సీనియర్ సిటిజెన్లు లబ్ది పొందారని ప్రభుత్వం తెలిపింది. దీంతో పక్క రాష్ట్రాలు కూడా మన ప్రభుత్వం కూడా సీనియర్స్ సిటిజన్స్ తీర్థయాత్రలకు వెళ్లడానికి ఉచితంగా విమాన ప్రయాణాన్ని అందించాలని కోరుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది