Viral Video : వామ్మో.. అడ‌విలో క‌నిపించిన ఇన్నోవా కారు.. అందులో 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల న‌గ‌దు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : వామ్మో.. అడ‌విలో క‌నిపించిన ఇన్నోవా కారు.. అందులో 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల న‌గ‌దు

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : వామ్మో.. అడ‌విలో క‌నిపించిన ఇన్నోవా కారు.. అందులో 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల న‌గ‌దు

Viral Video : మధ్యప్రదేశ్‌ madhya pradesh రాజధాని భోపాల్‌లో 52 kg gold  in car గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్‌యూవీ కారులో భారీ న‌గ‌దుతో పాటు బంగారం ల‌భించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆదాయపు పన్ను అధికారుల నుంచి తప్పించుకోడానికే కారులో బంగారం, నగదు తీసుకొచ్చి అక్కడ వదిలేసినట్టు తెలుస్తోంది. రోడ్డు పక్కగా నిలిపి ఉన్న ఒక ఎస్యూవీలో రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారు కడ్డీలు, రూ.11 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ, పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు గ్వాలియర్ వాసి పేరు మీద రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు…

Viral Video వామ్మో అడ‌విలో క‌నిపించిన ఇన్నోవా కారు అందులో 52 కేజీల బంగారం రూ10 కోట్ల న‌గ‌దు

Viral Video : వామ్మో.. అడ‌విలో క‌నిపించిన ఇన్నోవా కారు.. అందులో 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల న‌గ‌దు

Viral Video ఇంత మొత్తం ఎవ‌రిది..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుశాల్ పురా రోడ్డులో బ్యాగులతో వాహనం ఉందని, డిపార్ట్ మెంట్ కు సమాచారం అంద‌డంతో అక్క‌డికి వెళ్లి రైడ్ చేయ‌గా, కారులో న‌గ‌దు, బంగారం క‌నిపించింది కాని అందులో ఎవ‌రు లేర‌ని అధికారులు తెలిపారు. వాహనంలో సుమారు ఏడెనిమిది బ్యాగులు ఉన్నాయని ఒక వ్యక్తి రతిబాద్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. దీంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రియాంక శుక్లా తెలిపారు. కారును తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు. అందులో ఎవరూ లేకపోగా… ఏకంగా 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు కనిపించాయి. బంగారం, నగదుతో ఉన్న రెండు బ్యాగులను ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.

భోపాల్ నగరంలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న శర్మ నివాసంపై ఐటీ అధికారులు గురువారం నాడు దాడులు చేయగా, రూ.1 కోటి నగదు, అరకిలో బంగారం పట్టుబడ్డాయి. అంతేకాదు, విలువైన వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా… అడవిలో వదిలేసి వెళ్లిన ఇన్నోవా కారులోని డబ్బు, బంగారం కూడా సౌరభ్ శర్మకు చెందినవి అయ్యుంటాయని భావిస్తున్నారు. అయితే, బంగారం, నగదు తమవే అంటూ ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో, అవి ఎవరికి చెందినవో నిగ్గుతేల్చేందుకు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది