Apple | రోజుకో యాపిల్ తింటే ఎంతో ఆరోగ్యం .. డాక్టర్ అవసరం ఉండదు!
Apple | రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్న నానుడి కేవలం మాట కాదు, నిజంగానే ఆరోగ్య రహస్యం. నిపుణుల చెబుతున్న ప్రకారం, రోజుకు ఒక యాపిల్ తినడం శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. యాపిల్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
#image_title
ఎంత ఉపయోగం అంటే..
దీని వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాక, యాపిల్‌లో ఉన్న విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా దాడుల నుండి కాపాడుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్టు, యాపిల్‌లో ఉండే ఫైటోకెమికల్స్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. దీని ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు తొలగి హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది.
యాపిల్‌లో క్యాలరీలు తక్కువగా ఉండటంతో బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి, పొట్ట కొవ్వు తగ్గిపోతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇంతేకాదు, యాపిల్ పండ్లలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల్లో పేరుకునే కఫాన్ని కరిగించి, ఆస్తమా, జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తాయి.