Electricity Bill : ఏసీ ఉందా.. అయితే ఇలా చేసి కరెంట్ బిల్ తగ్గించుకోండి
Electricity Bill : ఎండలు మండిపోతున్నాయి.. ఉక్కపోత భరించలేపోతున్నాం.. వెంటనే ఫ్యాన్, కూలర్, ఏసీ అన్ చేసేస్తుంటాం. హాయిగా నిద్రపోతాం.. కానీ కరెంట్ బిల్ వచ్చినప్పుడు మాత్రం కంగుతింటాం.. మరీ ఇంత బిల్లా.. అని చిరాకు పడుతుంటాం. అలాగని ఎండనూ భరించలేం.. కాదని ఏసీ ఆన్ చేయకుండా ఉండలేం… ఇలా ఏదైనా చలి కాలంతో పోలిస్తే వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది. అయితే కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.ఎండలు మండుతున్నప్పుడు, ఉక్కబోత ఎక్కువగా ఉన్నప్పుడు గదిని త్వరగా చల్లబరచడానికి వెంటనే ఏసీ ఉష్ణోగ్రతను 18 నుండి 19 కి మారుస్తారు.
ఇది అధిక విద్యుత్ వినియోగానికి దారి తీస్తుంది. దాంతో కరెంట్ బిల్లు కూడా పెరుగుతోంది. అలా కాకుండా ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద సెట్ చేస్తే గది చల్లగా ఉంటుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏసీలో టైమర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది గది చల్లగా ఉన్నప్పుడు ఏసీని స్వయంచాలకంగా ఆఫ్ చేస్తుంది.ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు కిటికీలు డోర్లు తెరిచి ఉంచకుడదు. ఎందుకంటే ఏసీ నుండి వచ్చే చల్లదనం కూడా తగ్గిపోతుంది. దీంతో గది చల్లబడడానికి ఎక్కువ సేపు పడుతుంది. పైగా ఎక్కువ సేపు ఏసి వేసుకోవాల్సి వస్తుంది. గదిలో ఉండే కిటికీలను కర్టెన్లతో కట్టేయండి. దీనితో గది త్వరగా చల్లగా ఉంటుంది మరియు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు.మామూలుగా మనం ఏసీని వాడేసి వదిలేస్తాం..

does ac increase the electricity bill reduce
Electricity Bill : 24లో సెట్ చేయండి
మళ్లి సమ్మర్ వస్తే గాని గుర్తుకురాదు. కేవలం దానిని ఉపయోగించడమే తప్ప శుభ్రత కోసం చూసుకోం. కానీ నిజానికి ఏసీని వాడడం వలన కొన్ని రోజులకి ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము, ధూళి చేరిపోతుంది. ఈ కారణంగా దానిలో నుంచి గాలి సరిగా రాదు. గాలి సరిగా రాకపోవడం వల్ల ఏసీ త్వరగా గదిని చల్లగా మార్చలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏసీ ఫిల్టర్స్‌ని క్లీన్ చేసుకోవడం వల్ల మంచి గాలి వస్తుంది.మీరు ఏసీని వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేసుకోవడం వల్ల గది అంతా కూడా చల్లగా అవుతుంది. కాబట్టి ప్రతిసారి ఏసి వేసినప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ కూడా వేయడం చాలా మంచిది. దీని వల్ల మీ ఏసి గాలి అన్ని వైపులకి స్ప్రెడ్ అవుతుంది. తక్కువ టైంలోనే రూమ్ కూల్ అవుతుంది. అలాగే ఏసీ ఆఫ్ చేసినపుడు పవర్ బటన్ కూడా మర్చిపోకుండా ఆఫ్ చేయాలి. లేదంటే బిల్ అధికంగా వచ్చే అవకాశం ఉంది.