Senior NTR – Indira Gandhi : “సీనియర్ ఎన్టీఆర్”, “ఇందిరా గాంధీ” మధ్య జరిగిన ఈ సంఘటన మీకు తెలుసా..??
Senior NTR – Indira Gandhi : సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను ఎవ్వరూ మరిచిపోలేరు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్.. ఎంతో కష్టపడి పైకి ఎదిగి తెలుగు ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ఆయన సృష్టించిన చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేశంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. అప్పుడు దేశమంతా ఇందిరా గాంధీ మాటనే వినేవాళ్లు అంతా. తన కనుసన్నల్లో దేశాన్ని నడిపిస్తున్న సమయం అది. అంతే కాదు..
ఎన్టీఆర్ పార్టీ పెట్టి టీడీపీని గెలిపించే వరకు కూడా ఏపీలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ.. ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో ఒక ఘటన చోటు చేసుకుందట. ఆ విషయం గురించే ఇప్పటికీ అందరూ చెప్పుకుంటున్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో ఓవైపు ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తుండగా… ప్రధాన మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ కూడా ఏపీలో ప్రచారం చేసేందుకు వచ్చారట. తిరుపతిలో ఒకే రోజు ఓవైపు ఇందిరా గాంధీ, మరోవైపు ఎన్టీఆర్ సభలకు అనుమతి ఇచ్చారట. ప్రధాన మంత్రి సభ జరుగుతుండటంతో ఎన్టీఆర్ కోసం చేసే ర్యాలిని మాత్రం ఆపేశారట. తర్వాత ఎన్టీఆర్ వాహనాన్ని సభ కోసం అనుమతించారట. అదే సమయంలో ఇందిరా గాంధీ సభ జరుగుతోంది.
Senior NTR – Indira Gandhi : ఒకేసారి ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ సభకు అనుమతి
ఎన్టీఆర్ వాహనం తిరుపతిలో ఎంటర్ కాగానే.. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ పాట వినిపించిందట. దీంతో ఇందిరా గాంధీ సభలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా పరుగున వెళ్లి ఎన్టీఆర్ సభకు హాజరయ్యారట. ఏమైంది అని ఇందిరా గాంధీ అక్కడున్న వాళ్లను అడిగారట. దీంతో ఎన్టీఆర్ సభకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారని చెప్పడంతో ఆమె షాక్ అయ్యారట. ఎన్టీఆర్ కు ఇంత అభిమానం ఉందా? ఆయన్ను తక్కువ అంచనా వేశాం అని ఆమె పార్టీ నాయకులతోనూ చర్చించారట. అందుకే.. ఎన్టీఆర్ ప్రచారం మొత్తం పూర్తి కాకముందే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అయినా కూడా ఎన్టీఆర్ ఏపీలో విజయదుందుబి మోగించి ముఖ్యమంత్రి అయ్యారు.